ప్లేఆఫ్స్‌లో టాస్ గెలిచిన యూపీ.. ముంబై‌దే బ్యాటింగ్.. ఢిల్లీని ఢీకొనేదెవరో..?

Published : Mar 24, 2023, 07:03 PM ISTUpdated : Mar 24, 2023, 07:32 PM IST
ప్లేఆఫ్స్‌లో టాస్ గెలిచిన యూపీ.. ముంబై‌దే బ్యాటింగ్.. ఢిల్లీని ఢీకొనేదెవరో..?

సారాంశం

WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్  లో నేడు ముంబై ఇండియన్స్ - యూపీ వారియర్స్  మధ్య  కీలక పోరు జరుగునుంది.  ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్ లో ఢిల్లీతో తలపడుతుంది. 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్  ముగింపు దశకు చేరుకుంది. ఈ లీగ్ లో నేడు తొలి సీజన్  ప్లేఆఫ్స్ (ఎలిమినేటర్)  మ్యాచ్ జరుగుతున్నది.  ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా  యూపీ వారియర్స్ - ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో  గెలిచిన జట్టు  ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.  కాగా లీగ్ దశలో ఆడిన 8 మ్యాచ్ లు ఆడి ఆరింటిలో గెలిచిన ముంబై ఇండియన్స్..  నేటి  పోరులో టాస్ గెలిచిన యూపీ వారియర్స్ తొలుత బౌలింగ్ చేయనుంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కు రానుంది. ఈ లీగ్ లో మార్చి 26 (ఆదివారం) ఫైనల్ జరుగుతుంది.  పాయింట్ల పట్టికలో  అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో ప్లేఆఫ్స్ విజేత తలపడుతుంది. 

ఈ సీజన్ లో ఆడిన తొలి ఐదు మ్యాచ్ లలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్.. తర్వాత తడబడింది.  యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్  లు ముంబైకి డబుల్ స్ట్రోక్ ఇచ్చాయి.    దీంతో  ముంబై.. నేరుగా ఫైనల్ వెళ్లే అవకాశాన్ని మిస్ చేసుకుని   రెండో స్థానానికి పరిమితమైంది. 

ఇక యూపీ.. ఈ లీగ్ లో  ఎనిమిది మ్యాచ్ లు ఆడి నాలుగింటిలో గెలిచి నాలుగు మ్యాచ్ లలో ఓడింది. సీజన్ ఆరంభంలో కాస్త తడబడినా తర్వాత పుంజుకున్న యూపీ వారియర్స్  స్ట్రాంగ్ టీమ్  గా మారింది.  

ఆటగాళ్ల ప్రదర్శనలు.. 

ముంబై టీమ్ లో ఓపెనర్ యస్తికా భాటియా తడబడుతోంది.  మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్ మాత్రం నిలకడగా ఆడుతోంది.   సీవర్ బౌలింగ్ లో మెరుస్తున్నా   గత రెండు మ్యాచ్ లలో బ్యాటింగ్ లో విఫలమైంది.  ఆమె రాణించడం ముంబైకి చాలా  ముఖ్యం.  కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఫర్వాలేదనిపిస్తున్నా  భారీ స్కోర్లు చేయడం లేదు.  అమెలియా కెర్, ఇస్సీ వాంగ్ లు కూడా  చివర్లో బ్యాట్ ఝుళిపిస్తే  యూపీకి కష్టాలు తప్పవు.    బౌలింగ్ లో  ముంబై.. సీవర్,  ఇస్సీ వాంగ్ లు  గత రెండు మ్యాచ్ లలో  తిరిగి ఫామ్ లోకి వచ్చారు.  కానీ స్పిన్నర్ సైకా ఇషాక్  వికెట్లు తీయడంలో  విఫలమవుతోంది. 

యూపీ విషయానికొస్తే..   కెప్టెన్ అలీస్సా హీలి రాణిస్తున్నా ఆమెకు  సాయం అందించే ఓపెనర్ సెట్ కావడం లేదు. శ్వేతా సెహ్రావత్, దేవికా వైద్యలు విఫలమయ్యారు. అయితే ఆల్ రౌండర్లు తహిలా మెక్‌గ్రాత్,  గ్రేస్ హరీస్ లు  అద్భుత  ఆటతో    మ్యాచ్ ఫలితాలను మలుపు తిప్పుతున్నారు.  నేడు ముంబైతో మ్యాచ్ లో ఈ ఇద్దరూ కీలకం. వీరికి తోడు కిరణ్ నవ్‌గిరె కూడా మెరుపులు మెరిపిస్తే   ముంబైకి  చుక్కలే.   బౌలింగ్ లో దీప్తి శర్మ, పర్శవిలతో పాటు ఎకిల్‌స్టోన్ లు రాణిస్తే ముంబైకి కష్టాలు తప్పవు. 

తుది జట్లు : ఈ మ్యాచ్ కోసం  యూపీ జట్టులో పలు మార్పులు జరిగాయి.  ముంబై మాత్రం గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. 

ముంబై :  హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా, నటాలీ సీవర్,   హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమెలియా కెర్, ఇస్సీ వాంగ్, పూజా వస్త్రకార్, అమన్‌జ్యోత్ కౌర్, హుమైరా కాజి,  జింతమణి కలిత,  సైకా ఇషాక్ 

యూపీ : అలీస్సా హేలీ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, సిమ్రాన్ షేక్, తహిలా మెక్‌గ్రాత్, కిరణ్ నవ్‌గిరె,  గ్రేస్ హరీస్, దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టోన్, అంజలి శర్వణి,  పర్శవి చోప్రా, యశశ్రీ 

PREV
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !