వారం రోజుల్లో ఐపీఎల్.. ఫ్రాంచైజీలను వేధిస్తున్న గాయాలు..

Published : Mar 24, 2023, 05:10 PM IST
వారం రోజుల్లో ఐపీఎల్.. ఫ్రాంచైజీలను వేధిస్తున్న గాయాలు..

సారాంశం

IPL 2023: మార్చి 31 నుంచి మొదలుకాబోయే ఐపీఎల్ - 16 కు ముందే  ఫ్రాంచైజీలకు షాకులు తాకుతున్నాయి. ఆయా జట్లలోని కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్నారు. 

మరో  ఏడు రోజుల్లో భారత్ లో క్రికెట్ పండుగ మొదలుకానుంది. ఈనెల 31 నుంచి  ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 16వ ఎడిషన్  ప్రారంభమవనుంది. ఈ సీజన్ కోసం ఇప్పటికే  పది ఫ్రాంచైజీల ఆటగాళ్లు.. టీమ్ క్యాంప్ లకు చేరుకున్నారు. కొంతమంది విదేశీ ఆటగాళ్లు  నేడో రేపో తమ జట్లతో కలువబోతున్నారు.  రాబోయే సీజన్ లో  ఏ వ్యూహాలు అనుసరించాలి..? ప్రత్యర్థులను ఎలా బోల్తా కొట్టించాలి..? ఎవరిని ఆడించాలి..? అని ఫ్రాంచైజీలు  తలలు బద్దలుకొట్టుకుంటున్నాయి.  వీటితో పాటు దాదాపు అన్ని ఫ్రాంచైజీలను  ఓ సమస్య తీవ్రంగా వేధిస్తున్నది.  అదే  ‘ఆటగాళ్లకు గాయాలు’. ఇదీ, అదీ అని తేడా లేకుండా దాదాపు ప్రతి ఫ్రాంచైజీ గాయాల బాధితులుగానే ఉంది.  

ఐపీఎల్ అంటేనే దుమ్మురేపే ఆటగాళ్లలో ముందు వరుసలో ఉండే ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ సారథి  రిషభ్ పంత్ ఇదివరకే  గాయాల కారణంగా  ఈ మెగా టోర్నీ  నుంచి తప్పుకున్నారు. వీరితో పాటు  మరికొందరు కూడా  ఈ క్యాష్ రిచ్ లీగ్ కు దూరమయ్యారు. ఆ జాబితాను ఓసారి పరిశీలిస్తే.. 

గాయాల కారణంగా ఐపీఎల్-16 కు దూరమైన ఆటగాళ్లు 

1. బుమ్రా : ముంబై  
2. జై రిచర్డ్‌‌సన్ : ముంబై  
3. ప్రసిధ్ కృష్ణ : రాజస్తాన్ 
4. ఒబెడ్ మెక్‌కాయ్ : రాజస్తాన్ 
5. కైల్ జెమీసన్ :  చెన్నై
6. రిషభ్ పంత్ : ఢిల్లీ 
7. విల్ జాక్స్ :  బెంగళూరు 
8. జానీ బెయిర్ స్టో : పంజాబ్  

వీళ్లు ఆడేది అనుమానమే.. 

1. శ్రేయాస్ అయ్యర్ - కోల్కతా 
2. లాకీ ఫెర్గూసన్ - కోల్కతా 

కొత్త గాయాలు.. 

1. ముఖేష్ చౌదరి :  గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఈ పేసర్ దీపక్ చహర్ లేని లోటును తీర్చాడు. కానీ ఈ సీజన్ లో ముఖేష్ ఆడేది అనుమానంగానే ఉంది.   ఈ సీజన్ లో ముఖేష్ అందుబాటులో ఉంటాడా..? అన్న  ప్రశ్నకు సీఎస్కే సీఈవో   కాశీ విశ్వనాథన్ సమాధానం చెబుతూ.. ‘ముఖేష్ విషయంలో మేం ఇప్పుడే తుది నిర్ణయానికి రాలేకపోతున్నాం. అతడు ఈ సీజన్ ఆడతాడన్న నమ్మకం కూడా సన్నగిల్లుతోంది. గతేడాది అతడు బాగా ఆడాడు. కానీ ఈ  ఏడాది మేం అతడిని మిస్ అయ్యేలా ఉన్నాం..’అని చెప్పాడు. 

2. మోహ్సిన్ ఖాన్ : భారత  జట్టులో ఎంట్రీ కోసం  చూస్తున్న ఈ ఉత్తరప్రదేశ్ కుర్రాడు  గత ఐపీఎల్ లో లక్నో తరఫున ఆడుతూ  రాణించాడు. మోహ్సిన్ ఖాన్.. భారత్ కు లెఫ్టార్మ్ పేసర్ లేని లోటును తీరుస్తాడని   మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్న వేళ  తాజాగా అతడు ఈ సీజన్ లో లక్నో తరఫున  పలు మ్యాచ్ లు మిస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మోహ్సిన్ ఖాన్ ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించలేదని  తెలుస్తున్నది.మోహ్సిన్ దూరమైతే ఈ  సీజన్ లో లక్నోకు భారీ ఎదురుదెబ్బే. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !