ఛాంపియన్ టీమ్స్ మధ్య తొలి పోరు.. ముంబైతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ

Published : Mar 09, 2023, 07:03 PM ISTUpdated : Mar 09, 2023, 07:09 PM IST
ఛాంపియన్ టీమ్స్ మధ్య తొలి పోరు.. ముంబైతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ

సారాంశం

WPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  ఆడిన రెండుమ్యాచ్ లలోనూ గెలిచి  ఊపుమీదున్న రెండు జట్లూ నేడు తలపడబోతున్నాయి.  ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్ మధ్య  నేడు ఆసక్తికర పోరుకు తెరలేచింది.

మహిళల ప్రీమియర్ లీగ్ లో ఇప్పటివరకు  రెండేసి మ్యాచ్ లు ఆడిన  రెండు అగ్రశ్రేణి జట్లు నేడు సీజన్ లో తొలిసారి ఢీకొనబోతున్నాయి.  ముంబై ఇండియన్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య  నేడు  ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ కు రానుంది.  ఈ మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే ఆడుతుండగా  ఢిల్లీ జట్టులో ఒక మార్పు జరిగింది. అరుంధతి రెడ్డి స్థానంలో మిన్ను మని తుది జట్టులోకి వచ్చింది. 

ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ (గుజరాత్,  బెంగళూరు) లలో ఘనవిజయాలు సాధించిన ముంబై జట్టు.. అదే జోరును కొనసాగించి అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని ఆరాటపడుతున్నది. మరోవైపు తొలి మ్యాచ్ లో  ఆర్సీబీని తర్వాత  యూపీని ఓడించిన ఢిల్లీ కూడా  ప్రస్తుతం పాయింట్ల పట్టికలో  రెండో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్ లో   ముంబైని ఓడించి అగ్రస్థానానికి ఎగబాకాలని ఆ జట్టూ భావిస్తున్నది. 

ఆటగాళ్ల పరంగా ఇరు జట్లలోనూ సూపర్ స్టార్ బ్యాటర్లు,  భీకర బౌలర్లూ ఉన్నారు.  ముంబైలో  విండీస్ ఆల్ రౌండర్ హేలి మాథ్యూస్ సూపర్ ఫామ్ లో ఉంది. వికెట్ కీపర్ గా రాణిస్తున్నా యస్తికా భాటియా బ్యాటింగ్ లో మాత్రం విఫలమవుతోంది.  హర్మన్‌ప్రీత్ కౌర్, సీవర్,  అమిలియా కెర్ లతో ఆ జట్టు బ్యాటింగ్  దుర్బేధ్యంగా ఉంది.  బౌలర్లలో  ఇస్సీ వాంగ్, సైకా ఇషాక్,  పూజా వస్త్రకార్, సీవర్ లు ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు. 

ఇక ఢిల్లీలో కూడా  కెప్టెన్ మెగ్ లానింగ్ గత రెండు మ్యాచ్ లలో  70 ప్లస్ స్కోరుతో  ధాటిగా ఆడుతోంది.  షఫాలీ కూడా బాదుతూనే ఉంది.  మరిజనె కాప్,  జెమీమా రోడ్రిగ్స్, అలీస్ క్యాప్సీ, జొనాసేన్  లు కూడా ఫామ్ ను కొనసాగించాలని ఢిల్లీ భావిస్తున్నది. బౌలర్లలో తారా నోరిస్, రాధా యాదవ్, శిఖా పాండే లు  రాణిస్తున్నారు. 

తుది జట్లు : 

 

ఢిల్లీ : మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజనె కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలీస్ క్యాప్సీ, జెస్ జొనాసేన్, తానియా భాటియా,  మిన్ను మని, శిఖా పాండే,  రాధా యాదవ్, తారా నోరిస్ 

ముంబై: యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్, నటాలి సీవర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమిలియా కెర్, పూజా వస్త్రకార్, ఇస్సీ వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, హుమైరా కాజి, జింతమని కలిత, సైకా ఇషాక్ 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?