నేను ఫిట్‌గా ఉన్నా.. కానీ పక్కనబెట్టారన్న గుజరాత్ ఆల్ రౌండర్.. డబ్ల్యూపీఎల్‌లో తొలి వివాదం

Published : Mar 05, 2023, 04:30 PM ISTUpdated : Mar 05, 2023, 04:31 PM IST
నేను ఫిట్‌గా ఉన్నా.. కానీ పక్కనబెట్టారన్న గుజరాత్ ఆల్ రౌండర్.. డబ్ల్యూపీఎల్‌లో  తొలి వివాదం

సారాంశం

WPL 2023:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్  మొదలై  ఒక్క రోజు కూడా పూర్తికాకముందే ఈ లీగ్ కు వివాదం అంటుకుంది.  తాను ఫిట్ గా ఉన్నా  గాయం అయిందనే కారణంగా పక్కనబెట్టారనే కారణంతో  ఓ ప్లేయర్ గుజరాత్ టీమ్ పై సంచలన ఆరోపణలు చేసింది.  

మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ప్రారంభమై  24 గంటలు కూడా ముగియకముందే ఈ లీగ్ లో ఫ్రాంచైజీగా ఉన్న గుజరాత్ జెయింట్స్ పై  వెస్టిండీస్ ఆల్ రౌండర్  డియాండ్రా డాటిన్ సంచలన ఆరపణలు చేసింది.  తాను ఫిట్ గా ఉన్నా ఫ్రాంచైజీ తనను కావాలనే పక్కనబెట్టిందని ఆమె ఆరోపించింది.   దీనిపై తాజాగా గుజరాత్ కూడా స్పందించింది.  

ముంబైతో తొలి మ్యాచ్ కు ముందు  గుజరాత్ జెయింట్స్.. శుక్రవారం ఆ జట్టు ఆల్  రౌండర్ డియాండ్రా డాటిన్ ను టీమ్ నుంచి తప్పించింది. ఇంకా ఆమె గాయం నుంచి కోలుకోలేదని.. డాటిన్ స్థానంలో కిమ్ గార్త్ (ఆస్ట్రేలియా)  ను రిప్లేస్ చేసుకుంది.అయితే శనివారం   డాటిన్ స్పందిస్తూ.. ‘నేను ఫిట్ గానే ఉన్నా. నేనేం గాయం నుంచి కోలుకోవడం లేదు.  నన్ను ఎందుకు రిప్లేస్ చేశారో అర్థం కావడం లేదు..’అని వ్యాఖ్యానించింది. 

డాటిన్ వ్యాఖ్యలకు  తాజాగా గుజరాత్ జెయింట్స్ ట్విటర్ వేదికగా స్పందించింది. ఆదివారం సాయంత్రం  యూపీతో మ్యాచ్ కు ముందు  ఆ జట్టు ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘డాటిన్ వరల్డ్ క్లాస్ ప్లేయర్.  మాతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు  చాలా సంతోషంగా ఉంది. కానీ దురదృష్టవశాత్తూ   ఆమె నిర్ణీత గడువుకు ముందు మెడికల్  క్లీయరెన్స్ సర్టిఫికెట్ తీసుకురాలేదు.  ప్రతీ ప్లేయర్ కు  మెడికల్ క్లీయరెన్స్ సర్టిఫికెట్ అవసరం అని నిబంధనల్లో కూడా ఉంది. ఆమె త్వరలోనే మళ్లీ  ఫీల్డ్ లోకి వస్తుందని ఆశిస్తున్నాం. వచ్చే సీజన్లలో ఆమె మా ఫ్రాంచైజీ తరఫున భాగస్వామిగా ఉంటుంది..’అని ట్వీట్  చేసింది. 

 

ఇటీవలే ముగిసిన  డబ్ల్యూపీఎల్ వేలంలో   డాటిన్ ను గుజరాత్ జెయింట్స్.. రూ. 60 లక్షలు వెచ్చించి దక్కించుకుంది.  కానీ శుక్రవారం ఆమె స్థానంలో  కిమ్ గార్త్ ను ఎంపిక చేసుకున్నట్టు ప్రకటించింది. 

టీ20లలో దుమ్ము దులిపే డాటిన్.. వెస్టిండీస్ తరఫున  127 మ్యాచ్ లలో   2,697 పరుగులు చేసింది. బౌలింగ్ లో 62 వికెట్లు కూడా తీసింది.  

ఇక కిమ్ గార్త్.. గత నెలలో  జరిగిన వేలంలో పాల్గొన్నా ఆమె కోసం  ఏ ఫ్రాంచైజీ కూడా బిడ్  వేయలేదు.  కానీ  డాటిన్ కు రిప్లేస్‌మెంట్ గా  గార్త్ ను ఎంపిక చేయడం విశేషం.  గార్త్ ఆస్ట్రేలియా తరఫున  ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ లో  సభ్యురాలిగా ఉంది.  ఆసీస్ ఆడిన రెండు  వార్మప్ మ్యాచ్ లలో ఆమె ఆడింది.   ప్రధాన  మ్యాచ్ లలో అవకాశం రాకున్నా ఆమెకు అనూహ్యంగా డబ్ల్యూపీఎల్ లో అవకాశం రావడం గమనార్హం. 

వాస్తవానికి గార్త్.. ఐర్లాండ్ దేశస్తురాలు.   గతంలో ఆమె ఐర్లాండ్ తరఫున ఆడింది. కానీ  ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ లో  మెల్‌బోర్న్ స్టార్స్ తో మూడేండ్ల ఒప్పందం కుదుర్చుకున్న  గార్త్.. ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని పొందింది.   వరల్డ్ కప్ లో ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆమె ఐర్లాండ్ కు వ్యతిరేకంగా ఆడింది.  

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు