
రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ చేతిలో భారత్ వైట్ వాష్ అవ్వడంతో దీని ప్రభావం ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ర్యాంకింగ్స్‌పై ప్రభావం చూపింది. అదే సమయంలో భారత జట్టుపై విజయంతో కివీస్ ఈ ఛాంపియన్‌షిప్‌లో 180 పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.
ఏడు విజయాలు, రెండు ఓటములతో భారత్ 360 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా టీమిండియా కంటే 64 పాయింట్లు తక్కువగా ఆసీస్ రెండో స్థానంలో ఉంది. భారత్‌తో సిరీస్‌కు ముందు వరల్ట్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో కివీస్ 60 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
Also Read:కివీస్ పై ఘోర ఓటమి: కోహ్లీ బ్యాటింగ్ ఫట్, అయ్యో అనాల్సిందే
వెల్లింగ్టన్‌లో టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించడంతో న్యూజిలాండ్‌కు 60 పాయింట్లు వచ్చాయి. క్రైస్ట్‌చర్చ్‌లో తాజా విజయంతో కివీస్‌కు అదనంగా మరో 60 పాయింట్లు రావడంతో పాకిస్తాన్, ఇంగ్లాండ్‌లను వెనక్కినెట్టి మూడో స్థానానికి ఎగబాకింది.
ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, మూడు ఓటములు, ఒక డ్రాతో ఇంగ్లాండ్ 146 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోగా.. రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో పాకిస్తాన్ 140 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.
Also Read:న్యూజిలాండ్ టూర్: సిరీస్ లకు దూరమైనా టాప్ స్కోరర్స్ వీళ్లే
ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదలైన నాటి నుంచి దక్షిణాఫ్రికా పరిస్ధితి దారుణంగా ఉంది. ఏడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయంతో సఫారీలు ఏడో స్థానంలో నిలిచారు.
వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లు ఇంకా ఖాతా తెరవకపోవడంతో ఎనిమిది, తొమ్మిదవ స్థానాల్లో ఉన్నాయి. విండీస్ భారత్‌తో జరిగిన సిరీస్‌ను 2-0తో కోల్పోగా.. టీమిండియా, పాకిస్తాన్ చేతుల్లో చెరో మ్యాచ్‌ను ఓడిపోయింది బంగ్లాదేశ్.