World Cup 2023: భారత్ వేదికగా అతిపెద్ద క్రీడా సమరం.. వన్డే ప్రపంచ కప్‌ 2023 షెడ్యూల్ ఖరారు ..!  

Published : Mar 22, 2023, 12:17 AM IST
World Cup 2023: భారత్ వేదికగా అతిపెద్ద క్రీడా సమరం.. వన్డే ప్రపంచ కప్‌ 2023 షెడ్యూల్ ఖరారు ..!  

సారాంశం

World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023​ టీమ్‌ ఇండియా తమ సొంతగడ్డపైనే జరగనుంది. 10 జట్ల ICC ఈవెంట్‌లో జట్లు 46 రోజుల వ్యవధిలో మూడు నాకౌట్ గేమ్‌లతో సహా 48 మ్యాచ్‌లు జరుగునున్నాయి. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబై మొత్తం 12 వేదికలను బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసినట్టు సమాచారం. 

World Cup 2023: ఐపీఎల్​ తర్వాత క్రికెట్​ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే టోర్నీ వన్డే ప్రపంచ కప్ గురించే. పైగా ఈ సారి వన్డే ప్రపంచకప్ 2023​.. టీమ్‌ఇండియా తమ సొంతగడ్డపైనే జరగనుంది. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న  వన్డే ప్రపంచ కప్‌ 2023 షెడ్యూల్ ఖరారు అయినట్టు తెలుస్తోంది. భారత్ వేదికగా జరగనున్న ఈ టోర్నీ అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. ఈ మెగా ఈవెంట్ కు హోస్ట్ అయిన BCCI కనీసం డజను వేదికలను షార్ట్‌లిస్ట్ చేసినట్టు తెలుస్తుంది.

అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఈ టోర్నీ ప్రారంభ వేదిక కానున్నది. అహ్మదాబాద్‌ స్టేడియంతో పాటు  బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబై 12 వేదికలను బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసినట్టు సమాచారం. మొత్తం ఈ  టోర్నమెంట్‌లో 46 రోజుల వ్యవధిలో మూడు నాకౌట్‌లతో సహా 48 మ్యాచ్‌లు జరుగునున్నాయి.   భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో రుతుపవనాలు వల్ల ఎదురయ్యే సమస్యల కారణంగా వేదికలను ఖరారు చేయడంలో జాప్యం జరుగుతోంది.  

సాధారణంగా ఐసిసి కనీసం ఒక సంవత్సరం ముందుగానే ప్రపంచ కప్ షెడ్యూల్‌లను ప్రకటిస్తుంది. అయితే, భారత ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల కోసం బీసీసీఐ వేచి చూస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీకి పన్ను మినహాయింపు, పాకిస్థాన్ జట్టుకు వీసా క్లియరెన్స్ వంటి రెండు అంశాలు బీసీసీఐ ముందున్నాయి. గత వారాంతంలో దుబాయ్‌లో జరిగిన ఐసిసి త్రైమాసిక సమావేశాల సందర్భంగా పాకిస్తాన్ బృందానికి వీసాలను భారత ప్రభుత్వం క్లియర్ చేస్తుందని బిసిసిఐ.. ఐసిసికి హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఈ మెగా ఈవెంట్‌కు ఇప్పటికే ఏడు జట్లు అర్హత సాధించగా, చివరి మూడు స్థానాల కోసం తీవ్ర పోరు సాగుతోంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక కూడా ఇంకా తమ స్థానాలను బుక్ చేసుకోలేదు. ICC పురుషుల ప్రపంచకప్ సూపర్ లీగ్ స్టాండింగ్స్‌లో మొదటి ఎనిమిది జట్లు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

అర్హత సాధించిన జట్లు: ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా,ఆఫ్ఘనిస్తాన్.  కాగా.. వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు ప్రధాన ఈవెంట్‌ బెర్త్ కు పోటీ పడుతున్నాయి. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?