ఇప్పటికే వరుస ఓటములతో సతమతం అవుతూ సెమీస్ ఆశలను దాదాపుగా గల్లంతు చేసుకున్న పాకిస్థాన్ జట్టుకు ఐసిసి మరో షాక్ ఇచ్చింది.
హైదరాబాద్ : ఐసిసి వన్డే ప్రపంచ కప్ 2023 లో వరుస ఓటములతో పాకిస్థాన్ సతమతం అవుతోంది. దాయాది భారత్ చేతిలో ఘోర పరాజయం తర్వాత పాక్ జట్టు కోలుకోవడం లేదు. చివరకు పసికూన అప్ఘానిస్తాన్ చేతిలోనూ ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది బాబర్ సేన. ఇలాంటి సమయంలో ఇటీవల దక్షిణాఫ్రికా చేతిలో మరో ఓటమిని చవిచూసి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది పాకిస్థాన్.ఇలా ఇప్పటికే ప్రపంచ కప్ మెగా టోర్నీలో చెత్తప్రదర్శన కనబరుస్తున్న పాకిస్థాన్ జట్టుకు ఐసిసి మరో షాక్ ఇచ్చింది.
తమిళనాడు రాజధాని చెన్నైలోని చిన్నస్వామి స్టేడియంలో గత శుక్రవారం పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికానే విజయం వరించింది. ఇలా వరుసగా మరో ఓటమిని చవిచూసిన బాధలో వున్న పాక్ జట్టుకు మరో షాక్ ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ పాక్ బౌలర్లు నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తిచేయలేకపోవడాన్ని ఐసిసి గుర్తించింది. దీంతో టీంలోని అందరు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నట్లు ఐసిసి ప్రకటించింది.
నిర్ణీత సమయంలో పాక్ 4 ఓవర్లు వెనకబడిందని... దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఐసిసి పాక్ టీం ను కోరింది. స్లో ఓవర్ రేట్ ను పాక్ జట్టు అంగీకరించడంతో ఆటగాళ్ళ ఫీజులో 20శాతం కోత విధిస్తున్నట్లు ఐసిసి ప్రకటించింది. దీంతో అసలే ఓటములతో సతమతం అవుతున్న పాకిస్థాన్ జట్టుకు ఈ జరిమానా మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అయ్యింది.
undefined
Read More డీఆర్‌ఎస్ వల్లే పాకిస్తాన్ ఓడిపోయిందన్న హర్భజన్ సింగ్! మరి మావాడి పరిస్థితి ఏంటన్న గ్రేమ్ స్మిత్...
ఇదిలావుంటే పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ విజయావకాశాలు చేతులుమారుతూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 271 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. ఇలా వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ పాకిస్తాన్ ఓటమిపాలయ్యింది.