నాలుగో స్థానంపై క్లారిటీ ఇచ్చిన కోహ్లీ...పరోక్షంగా అతడికే మద్దతు

By Arun Kumar PFirst Published May 29, 2019, 6:25 PM IST
Highlights

ప్రపంచ కప్ మెగా టోర్నీకోసం జరిగిన సన్నాహక  మ్యాచ్ ద్వారా టీమిండియా సమస్యకు పరిష్కరం జరగింది. మంగళవారం కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో  తలపడ్డ  టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ ద్వారా విజయాన్ని అందుకున్న భారత ఆటగాళ్లు పూర్తి ఆత్మవిశ్వాసాన్ని మెయిన్ టోర్నీలోకి అడుగుపెట్టనున్నారు. అంతేకాకుండా టీమిండియా బ్యాటింగ్  విభాగానికి సమస్యగా మారిన నాలుగో స్థానంపై కూడా ఓ క్లారిటీ  వచ్చింది.
 
రెండో వార్మప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఘనవిజయం సాధించిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా సెంచరీ వీరుడు కెఎల్ రాహుల్(108 పరుగులు) ను ప్రశంసించాడు. అత్యంత క్లిష్టమైన నాలుగో స్థానంలో బరిలోకి దిగి రాహుల్ వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ పరుగులు సాధించిన విధానం చాలా బాగుందన్నాడు. రాహుల్  నాలుగో స్థానంలో రాణించడం టీమిండియాకు సానుకూలాంశమని కోహ్లీ పేర్కొన్నాడు.  

కోహ్లీ మాటలను బట్టి చూస్తే రాహుల్ ఇకపై కూడా నాలుగో స్థానంలో బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే నాలుగో స్థానంపై ఆశలు పెట్టుకున్న విజయ్ శంకర్ ఐదో స్థానానికే పరిమితం కానున్నాడు. లేదంటే ధోనికి ప్రమోషన్ ఇచ్చి ఐదో స్థానానికి తీసుకువచ్చి విజయ్ శంకర్ ను లోయర్ ఆర్డర్ లో బరిలోకి దించనున్నారు. 

ఇక ఈ మ్యాచ్ లో ఓపెనర్లు రోహిత్, శిఖర్ విఫలమైనా మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్స్ చక్కగా ఆడారని కోహ్లీ అన్నారు. ముఖ్యంగా ధోని (113 పరుగులు) సెంచరీ భారత విజయంలో కీలక పాత్ర పోషించిందన్నారు. అలాగే పాండ్యా కూడా  అద్భుతంగా ఆడాడని కోహ్లీ ప్రశంసించాడు. వీరితో పాటు బౌలర్లు కూడా రాణించడంతో భారత్‌ 95 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుందని కోహ్లీ తెలిపాడు.  

click me!