ప్రపంచ కప్ ఓటమి ఎఫెక్ట్...పాక్ చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ రాజీనామా

By Arun Kumar PFirst Published Jul 18, 2019, 8:53 PM IST
Highlights

పాకిస్థాన్ జట్టు లీగ్ దశను కూడా దాటకుండానే ప్రపంచ కప్ నుండి నిష్క్రమించడంతో పిసిబి ప్రక్షాళన ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బిగ్ వికెట్ పడింది. 

ప్రపంచ కప్ మెగా టోర్నీ ముగిసింది. ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన ఈ టోర్నీని ఎన్నో ఆశలతో ప్రారంభించిన కొన్ని జట్లు ఆశించిన మేర రాణించలేకపోయాయి. అలాంటి జట్లలో మన దాయాది పాకిస్థాన్ ఒకటి. ఈ మెగా టోర్నీలో ఆ జట్టు కనీసం లీగ్ దశను కూడా దాటలేక పోయింది. మరీ ముఖ్యంగా టీమిండియా చేతిలో ఓటమిపాలవడంతో సొంత అభిమానుల నుండే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పిసిబి(పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) జట్టు ప్రక్షాళనను చేపట్టింది. 

అయితే పిసిబి చేత గెంటివేతకు గురవకుండా మర్యాదగా తానే తప్పుకోవాలని చీఫ్ సెలెక్టర్, మాజీ పాక్ కెప్టెర్ ఇంజమామ్ హక్ భావించినట్లున్నాడు. అందువల్లే ప్రధాన సెలెక్టర్ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. ఒకవేళ తన అవసం పాక్ క్రికెట్ కు ఇంకా వుందని భావిస్తే తిరిగి తన బాధ్యతలు స్వీకరించడానికి సిద్దమేనంటూ పిసిబికి సమాచారమిచ్చాడు. అయితే బోర్డు తీసుకునే నిర్ణయానికి మాత్రం కట్టుబడి వుంటానని ఇంజమామ్ తెలిపాడు.  

ఇంజమామ్ పదవీకాలం ఈ నెలతో ముగుస్తుంది. అయితే ప్రపంచ కప్ జట్టు ఎంపికలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అతన్ని తిరిగి ఆ భాద్యతలు  అప్పగించడానికి పిసిబి సుముఖంగా లేదు. అంతేకాకుండా రానున్న రోజుల్లో పాక్ కొన్ని ప్రతిష్టాత్మక టోర్నీల్లో పాల్గొనాల్సి వుంటుంది. అప్పుడు కూడా పాక్ జట్టు ప్రదర్శన మారకుంటే తీవ్ర విమర్శలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఇంజమామ్ కొనసాగింపును అందరూ తప్పుబట్టే అవకాశముంది. కాబట్టి అతన్ని చీఫ్ సెలెక్టర్ పదవి నుండి తొలగించడమే అన్ని విధాలా మంచిదని పిసిబి భావిస్తున్నట్లు సమాచారం. 

దీంతో గత మూడేళ్లుగా చీఫ్ సెలెక్టర్ గా కొనసాగుతున్న ఇంజమామ్ తన ఒప్పందాన్ని తిరిగి పొడిగించుకునేందుకు  సుముఖంగా లేడు. అయితే ఒకవేళ పిసిబి దరఖాస్తు చేసుకోమంటే తప్పకుండా చేసుకుంటానంటూ మరో అవకాశమివ్వాలంటూ పరోక్షంగా కోరాడు. అయితే ఇంజమామ్ రాజీనామాపై పాక్ బోర్డు ఎలా స్పందిస్తుందో చూడాలి.     

click me!