వుమెన్స్ టీ20 ఛాలెంజ్ ఫైనల్: డియాండ్రా హాఫ్ సెంచరీ, హర్మన్‌ప్రీత్ మెరుపులు... వెలాసిటీ ముందు...

Published : May 28, 2022, 09:20 PM IST
వుమెన్స్ టీ20 ఛాలెంజ్ ఫైనల్: డియాండ్రా హాఫ్ సెంచరీ, హర్మన్‌ప్రీత్ మెరుపులు... వెలాసిటీ ముందు...

సారాంశం

Women T20 Challenge 2022 Final: 62 పరుగులు చేసిన డియాండ్రా డాటిన్... 43 పరుగులతో మెరుపులు మెరిపించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. వెలాసిటీ ముందు...

వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌ 2022 సీజన్ ఫైనల్‌లో భాగంగా నేడు సూపర్ నోవాస్ జట్టు, వెలాసిటీతో తలబడుతోంది. టాస్ గెలిచిన వెలాసిటీ కెప్టెన్ దీప్తి శర్మ, ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది...

సూపర్ నోవాస్ టీమ్‌కి అదిరిపోయే ఆరంభాన్ని అందించారు ఓపెనర్లు ప్రియా పూనియా, డియాండ్రా డాటిన్. తొలి వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత ప్రియా అవుటైంది. 29 బంతుల్లో 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన ప్రియా పూనియా, సిమ్రన్ బహదూర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది...

ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది డియాండ్రా డాటిన్. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న డియాండ్రా, వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన ఫారిన్ ప్లేయర్‌గా నిలిచింది...

ఓవరాల్‌గా డియాండ్రాది నాలుగో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఇంతకుముందు కిరన్ నవ్‌వైర్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదగా, షెఫాలీ వర్మ 30 బంతుల్లో, జెమీమా రోడ్రిగ్స్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశారు. 44 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 62 పరుగులు చేసిన డియాండ్రా డాటిన్, దీప్తి శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ చేశాడు.. 

పూజా వస్త్రాకర్ 5 బంతుల్లో 5 పరుగులు చేయగా సోఫీ ఎక్లేస్టోన్ 2, సూనీ లూజ్ 3, హర్లీన్ డియోల్ 7 పరుగులు చేసి అవుట్ కాగా హర్మన్‌ప్రీత్ కౌర్ 29 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించింది.  

హాఫ్ సెంచరీకి చేరువైన హర్మన్‌ప్రీత్ కౌర్‌, కేట్ క్రాస్ బౌలింగ్‌లో షెఫాలీ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుటైంది. ఈ సీజన్‌లో 150 పరుగులు పూర్తి చేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్, ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి బ్యాటర్‌గా నిలిచింది. ఇంతకుముందు 2019లో జెమీమా రోడ్రిగ్స్ చేసిన 123 పరుగులే వుమెన్స్ టీ20 ఛాలెంజ్‌ ఓ సీజన్‌లో అత్యధిక స్కోరుగా ఉంది...

ఒకానొక దశలో 17.2 ఓవర్లలో 148/3 స్కోరుతో ఉండి వెలాసిటీ ముందు భారీ లక్ష్యాన్ని పెట్టేలా కనిపించిన సూపర్ నోవాస్, వరుస వికెట్లు కోల్పోయి అనుకున్నంత స్కోరు కొట్టలేకపోయింది. వెలాసిటీ బౌలర్లలో కేట్ క్రాస్, దీప్తి శర్మ, సిమ్రాన్ బహదూర్ రెండేసి వికెట్లు తీయగా అయబొంగ ఖాఖాకి ఓ వికెట్ దక్కింది.

 డిఫెండింగ్ ఛాంపియన్ ట్రైయిల్ బ్లేజర్స్ జట్టు నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది.

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?