IPL2022:సిరాజ్ కి మద్దతుగా నిలిచిన మైక్ హెసన్

By telugu news teamFirst Published May 28, 2022, 10:23 AM IST
Highlights

 సిరాజ్ కి మద్దతుగా ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెసన్ నిలిచాడు. సిరాజ్ లో కాన్ఫిడెన్స్  కాస్త తగ్గినట్లు అనిపించినా...మళ్లీ స్ట్రాంగ్ గా తిరిగి వస్తాడని తాను అనుకుంటున్నట్లు ఆయన చెప్పాడు.
 

ఐపీఎల్ లో ఆర్సీబీ పోరు ముగిసింది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి చవిచూసింది. 7 వికెట్ల నష్టంతో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. కాగా... ఐపీఎల్ లో.. ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు ఇచ్చిన తొలి బౌలర్‌గా సిరాజ్‌ నిలిచాడు.ఐపీఎల్‌-2022సీజన్‌లో 30 సిక్స్‌లు ఇచ్చిన సిరాజ్‌ ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు 2018 సీజన్‌లో డ్వేన్‌ బ్రావో 29 సిక్స్‌లు సమర్పించుకున్నాడు.  దీంతో.. సిరాజ్ ని అందరూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

కాగా.. సిరాజ్ కి మద్దతుగా ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెసన్ నిలిచాడు. సిరాజ్ లో కాన్ఫిడెన్స్  కాస్త తగ్గినట్లు అనిపించినా...మళ్లీ స్ట్రాంగ్ గా తిరిగి వస్తాడని తాను అనుకుంటున్నట్లు ఆయన చెప్పాడు.

శుక్రవారం రాజస్థాన్ చేతిలో ఓటమి తర్వాత.. హెసన్ మీడియాతో మాట్లాడారు. మ్యాచ్ ప్రారంభంలో వికెట్లు తీయలేకపోవడం వల్ల కొంచెం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడని.. అయితే పేసర్ మానసికంగా బలంగా ఉన్నాడని... మళ్లీ స్ట్రాంగ్ గా వెనక్కి వస్తాడని ఆయన చెప్పారు.

RCB చివరి లీగ్ గేమ్‌కు తొలగించబడిన సిరాజ్, ప్లేఆఫ్‌లలో పనిని పూర్తి చేయడానికి జట్టు మేనేజ్‌మెంట్ నుండి మద్దతు పొందాడు. అయినప్పటికీ, అతను జట్టు తనపై చూపిన నమ్మకాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు, రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లలో కేవలం 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు.మ్యాచ్‌లలో 6 ఓవర్లలో 75 పరుగులు ఇచ్చాడు.

శుక్రవారం, రాజస్థాన్ 158 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడంతో పాటు ఐపిఎల్ 2022 ఫైనల్‌లో బెర్త్‌ను ఖాయం చేసుకోవడంతో  ఆర్సీబీ  ఇంటి ముఖం పట్టింది. 

"మహ్మద్ సిరాజ్ మంచి బౌలర్, అతని అత్యుత్తమ టోర్నమెంట్ లేదు కానీ అతను బలంగా తిరిగి వస్తాడని మాకు తెలుసు" అని హెస్సన్ చెప్పాడు.


 

click me!