Women's World Cup 2022: టాయ్లెట్ లో చిక్కుకుపోయిన ఆసీస్ మహిళా క్రికెటర్.. ఆఖరికి కత్తితో..

Published : Mar 01, 2022, 05:11 PM IST
Women's World Cup 2022:  టాయ్లెట్ లో చిక్కుకుపోయిన ఆసీస్ మహిళా క్రికెటర్.. ఆఖరికి కత్తితో..

సారాంశం

Women’s World Cup 2022:  మహిళల ప్రపంచకప్ లో భాగంగా విండీస్ తో జరిగిన వార్మప్ మ్యాచుకు ముందు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ నికోలా కేరీకి చేదు అనుభవం ఎదురైంది. సుమారు అరగంట పాటు ఆమె...  

న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా  క్రికెటర్ నికోలా కేరీకి చేదు అనుభవం  ఎదురైంది. వెస్టిండీస్ తో వార్మప్ మ్యాచ్ సందర్భంగా సహచర క్రికెటర్లంతా  గ్రౌండ్ కి వెళ్తే.. ఆమె మాత్రం టాయ్లెట్ రూమ్ లో చిక్కుకుపోయింది.  20 నిమిషాల దాకా  టాయ్లెట్ లోనే బిక్కుబిక్కుమంటూ గడిపింది.  మ్యాచుకు సమయం దగ్గరపడుతుండటంతో  టాయ్లెట్ కు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో అక్కడికి వెళ్లి చూసిన ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు మేనేజర్..  చివరికి ఆమెను రక్షించింది.

ప్రపంచకప్ లో భాగంగా వెస్టిండీస్ తో వార్మప్ మ్యాచుకు సిద్ధమవుతున్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్  నికోలా కేరీ.. తాను టాయ్లెట్ కు వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. అయితే టాయ్లెట్ కు వెళ్లి లాక్ వేసుకున్న ఆమె.. పని ముగించుకుని తిరిగి లాక్ తీయబోయింది. కానీ  దురదృష్టవశాత్తు ఆ లాక్  జామ్ అయింది. 

 

దీంతో  కాసేపు తలుపు తీయడానికి ప్రయత్నించిన కేరీ.. ఇక లాభం లేదని  లోపల్నుంచి ‘ఎవరైనా ఉన్నారా’ అని  పిలిచింది.  చివరికి విషయం తెలుసుకున్న టీమ్ మేనేజర్ మిల్స్ వచ్చి టాయ్లెట్ తలుపు తీయడానికి ప్రయత్నించింది.   కొద్దిసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి  ఒక బటర్ నైఫ్ ను కేరీకి అందించింది మిల్స్. నైఫ్ సాయంతో  లాక్ ను  తీసి.. టాయ్లెట్ నుంచి బయటపడింది. ఈ విషయాన్ని స్వయంగా  ఆమె వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్ టీమ్.. తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది.  

ఇదిలాఉండగా విండీస్ తో జరిగిన  వార్మప్ మ్యాచులో ఆసీస్ ఘన విజయం సాధించింది.   ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన  విండీస్.. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులే చేసింది. ఫలితంగా ఆసీస్.. 90 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ  మ్యాచులో కేరీ 19 పరుగులు చేసింది.   

అయితే మంగళవారం జరిగిన మరో వార్మప్ గేమ్ లో ఆసీస్..  న్యూజిలాండ్ చేతిలో చిత్తైంది. ఈ మ్యాచులో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.   మార్చి 4 నుంచి ప్రారంభం కాబోయే గ్రూప్ మ్యాచులతో టోర్నీకి తెరలేవనున్నది. తొలి మ్యాచులో న్యూజిలాండ్.. వెస్టిండీస్ ను ఢీకొననుంది. 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు