కెరీర్ కి ముగింపు పలకాలని అనుకుంటున్నా.. మిథాలీ రాజ్

By telugu news teamFirst Published May 2, 2020, 8:31 AM IST
Highlights

కరోనా సంక్షోభం కారణంగా ఈ ఈవెంట్ నిలిచిపోదని మిథాలీ రాజ్ అన్నారు. అయితే మహిళల క్రికెట్ జట్టు నవంబర్ 2019 నుండి వన్డేలు ఆడలేదు.కరోనా సంక్షోభం కారణంగా జూన్-జూలైలో భారత ఇంగ్లాండ్ పర్యటన కూడా వాయిదా పడింది. 

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టైటిల్ ను అందుకోవాలనే కోరిక ఆమెను ప్రతిరోజూ  ముందుకు నెట్టివేస్తోందని, 2021 ఉమెన్స్ వరల్డ్ కప్ గెలవడానికి ఆమె తన బెస్ట్ ఇస్తానని భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. వరల్డ్ కప్ గెలిచిన  తర్వాత 2021లో తాను తన కెరిర్ ని  ముగించాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు. మహిళల టీ 20 ప్రపంచ కప్ 2021 ఫిబ్రవరి-మార్చిలో న్యూజిలాండ్‌లో జరగనున్న విషయం అందరికి తెలిసిందే. 

అయితే  కరోనా సంక్షోభం కారణంగా ఈ ఈవెంట్ నిలిచిపోదని మిథాలీ రాజ్ అన్నారు. అయితే మహిళల క్రికెట్ జట్టు నవంబర్ 2019 నుండి వన్డేలు ఆడలేదు.కరోనా సంక్షోభం కారణంగా జూన్-జూలైలో భారత ఇంగ్లాండ్ పర్యటన కూడా వాయిదా పడింది. 

ఈ వైరస్ ప్రభావం తగ్గి.. ప్రపంచ కప్‌కు ముందు మేము కొన్ని సిరీస్‌లు ఆడుతామని తాను భావిస్తున్నట్లు మిథాలీ చెప్పారు. ఇప్పటి వరకు 4-5 వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడినా.. ఒక్కటి కూడా గెలవలేదని ఆమె చెప్పారు. అది తనకు ఎంతో బాధ కలిగిస్తోందని తెలిపారు.

కామెంటేటర్​ లిసా షలేకర్​తో మిథాలీ రాజ్ ఇన్​స్టాగ్రామ్ లైవ్ ద్వారా మాట్లాడి పలు విషయాలు పంచుకున్నారు. 'నేను, జులన్​ గోస్వామి కలిసి చాలా ఏళ్లు టీమిండియాకు ఆడాం. 4-5 ప్రపంచకప్​ టోర్నీల్లో బరిలోకి దిగాం. అయినా ఒక్క ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకోలేకపోయాం. ఇది నిజంగా చాలా బాధిస్తున్నది. 2021 ప్రపంచకప్​లో మరింత అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకుంటున్నా, అందుకోసం కష్టపడుతున్నా. ఇద్దరం ఫిట్‌నెస్‌పై ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది' అని మిథాలీ చెప్పారు.

అయితే 2017 లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో మిథాలీ జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. అలాగే ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో జరిగిన టీ 20 ప్రపంచ కప్‌లో భారత్ ఫైనల్ కు చేరుకుంది కానీ ఆతిధ్య జట్టు అయిన ఆసీస్ చేతిలో ఓడిపోయింది. 
 

click me!