బీసీసీఐ కొత్త బాస్ ఎవ‌రు? రేసులో ఉన్న‌ది ఎవ‌రు? జైషా ఓటు ఎవ‌రికి?

By Mahesh RajamoniFirst Published Aug 28, 2024, 11:36 AM IST
Highlights

bcci  : బీసీసీఐ సెక్రటరీ జై షా ఇప్పుడు ఐసీసీ ఛైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. దీంతో బీసీసీఐ బాధ్యతలు ఎవరు చేపడతారనేది ఆస‌క్తికర‌ంగా మారింది. ఈ క్ర‌మంలోనే క్రికెట్ వ‌ర్గాల్లో ప‌లువురి పేర్లు వినిపిస్తున్నాయి.
 

bcci  : బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జైషా ఇప్పుడు ఐసీసీ తదుపరి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐసీసీ ఛైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఆయ‌న ఎన్నిక‌య్యారు. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. డిసెంబరు నుంచి ఐసీసీ చైర్మన్‌గా జైషా పదవీకాలం ప్రారంభం కానుంది. 35 ఏళ్ల షా ఈ ప‌ద‌విని చేప‌ట్టిన అతిపిన్న వ‌య‌స్కుడిగా రికార్డు సృష్టించారు. ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే స్థానంలో  జైషా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. జైషా ఐసీసీకి వెళ్ల‌డంతో ఇప్పుడు బీసీసీఐ సెక్ర‌ట‌రీ పోస్టు ఖాళీ అవుతుంది. దీంతో బీసీసీఐ కొత్త చీఫ్ గురించి చ‌ర్చ సాగుతోంది. 2019 నుంచి కొనసాగుతున్న బీసీసీఐ కార్యదర్శి పదవి నుంచి షా ఇప్పుడు తప్పుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ తదుపరి కార్యదర్శి ఎవరన్న చ‌ర్చ మ‌ధ్య రేసులో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. 

అతి పిన్న వయస్కుడైన ఐసీసీ ఛైర్మన్ గా జైషా 

Latest Videos

ఆగస్టు 27న ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 35 ఏళ్ల జయ్ షా ఐసీసీకి నాయకత్వం వహించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కనున్నాడు. కొంతకాలంగా ఇదే అంశం క్రికెట్ వ‌ర్గాల్లో నిత్యం చ‌ర్చ‌లో ఉన్న‌ది. ఇప్పుడు జైషా నాయ‌క‌త్వాన్ని  ఐసీసీ అధికారికంగా ధృవీక‌రించింది.

బీసీసీఐ కార్య‌ద‌ర్శి రేసులో ఉన్న‌ది వీరే.. 

రాజీవ్ శుక్లా

బీసీసీఐ పదవులను పునర్వ్యవస్థీకరించి ప్రస్తుత ఉపాధ్యక్షుడు, రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న శుక్లాను ఏడాది పాటు బీసీసీఐ చీఫ్ గా ప‌ని చేయమని కోరే అవకాశం ఉంది. శుక్లా సెక్రటరీ కావడానికి ఖచ్చితంగా పెద్ద‌గా అభ్యంతరం ఉండదని స‌మాచారం. 

ఆశిష్ షెలార్

మహారాష్ట్ర బీజేపీ వెటరన్ షెలార్.. బీసీసీఐ కోశాధికారి, ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ) పరిపాలనలో చాలా ప్ర‌భావం ఉన్న వ్య‌క్తి. అయితే, రాజ‌కీయాల్లో కీల‌క‌పాత్ర పోషిస్తున్న ఆయ‌న బీసీసీఐ కార్యదర్శి పదవికి తన సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. బీసీసీఐ చీఫ్ రేసులో ఉన్న‌డ‌ని ప‌లు మీడియా నివేదిక‌లు పేర్కొంటున్నాయి. 

అరుణ్ ధుమాల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛైర్మన్‌గా అరుణ్ ధుమాల్ కు బోర్డును నడిపిన అనుభవం ఉంది. లాభదాయకమైన క్రికెట్ లీగ్‌కు కోశాధికారిగా, అధిపతిగా ఉన్నాడు. 

జాయింట్ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా

ఈ రేసులో ఉన్న ముఖ్య‌మైన పేరు కాన‌ప్ప‌టికీ ప్రస్తుత బీసీసీఐ పరిపాలనలో అతను ఒక ముఖ్యమైన లింక్. బీసీసీఐ ప‌రిస్థితుల దృష్ట్యా ఆయ‌న కూడ బీసీసీఐ చీఫ్ రేసులో ఉన్నారు.

రోహన్ జైట్లీ

ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడు రోహన్ జైట్లీ పేరు కూడా బీసీసీఐ చీఫ్ రేసులో ఉంది. వీరితో పాటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా పేర్లు చర్చకు రావచ్చు. ఇతర యూత్ స్టేట్ యూనిట్ అధికారులు పంజాబ్‌కు చెందిన దిల్షేర్ ఖన్నా, గోవాకు చెందిన విపుల్ ఫడ్కే, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రభతేజ్ భాటియాలు కూడా ఉన్నారు. అయితే, జైషా అరుణ్ జైట్లీకి అనుకూలంగా ఓటు వేసే అవ‌కాశాలున్నాయ‌ని క్రికెట్-రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. రోహన్ జైట్లీ మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ రాజకీయ నాయకుడు అరుణ్ జైట్లీ కుమారుడు. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. బీసీసీఐ నాయకుల్లో మంచి గుర్తింపు సాధించారు.

click me!