మ్యాచ్ మధ్య‌లోనే గ్రౌండ్ లో ప్రేక్ష‌కుల‌తో కలిసి స్టెప్పులేసిన క్రికెటర్.. వీడియో వైర‌ల్ !

By Mahesh Rajamoni  |  First Published Dec 28, 2023, 1:21 PM IST

Hasan Ali dance: ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుండగానే ఓ ప్లేయ‌ర్ క్రికెట్ అభిమానుల‌తో క‌లిసి గ్రౌండ్ లో స్టెప్పులేశాడు. పాక్ ప్లేయ‌ర్ హసన్ అలీ డాన్స్ వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 
 


AUS vs PAK - Hasan Ali dance: ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ‌ధ్య జ‌రుగుతున్న బాక్సింగ్ డే టెస్టు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. రెండు జ‌ట్ల తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు పై చేయి సాధించ‌గా, రెండో ఇన్నింగ్స్ క‌ష్టాల్లో ప‌డింది. 16 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయింది. ప్ర‌స్తుతం 187/6 ప‌రుగుల‌తో క్రీజులో అలెక్స్ కోరే (16*) ఉన్నాడు. అయితే, మెల్బోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న ఆస్ట్రేలియా-పాకిస్థాన్ టెస్ట్ మ్యాచ్  జ‌రుగుతుండగా, మ్యాచ్ జరుగుతుండగానే ఓ ప్లేయ‌ర్ క్రికెట్ అభిమానుల‌తో క‌లిసి గ్రౌండ్ లో డాన్స్ చేశాడు. అత‌నే పాక్ ప్లేయ‌ర్ హ‌స‌న్ అలీ. ఆ మాస్ డాన్స్ వీడియోల ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.

పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ జట్టులో అత్యంత సరదాగా ఉండే ప్లేయ‌ర్ల‌లో ఒక‌డు. అతను గ్రౌండ్ లో స్వేచ్ఛగా క‌దులుతూ చేసే విన్యాసాలు అంద‌రినీ అక‌ట్టుకుంటూ ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు అలీ బౌండరీపై ఫీల్డింగ్ చేస్తుండగా స్టెప్పులేశాడు. ప్రేక్షకులు అతని డ్యాన్స్ మూవ్స్ కు ఫిదా అయిపోయారు. అత‌నితో క‌లిసి డాన్సు చేశాడు. అమీర్ జమాల్ వేసిన ఇన్నింగ్స్ 53వ ఓవర్ సంద‌ర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బౌండరీ లైన్ వ‌ద్ద‌ ఫీల్డింగ్ చేస్తున్న హ‌స‌న్ అలీ.. డాన్సు చేయ‌డం షురూ చేశాడు. దీంతో అక్క‌డే ఉన్న క్రికెట్ ప్రియులు అతడితో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశాడు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ఎక్స్ లో పోస్టు చేయ‌గా తెగ వైర‌ల్ అవుతోంది.

Latest Videos

 

Get your body moving with Hasan Ali! pic.twitter.com/8Y0ltpInXx

— cricket.com.au (@cricketcomau)

అప్పుడు విమ‌ర్శ‌లు.. ఇప్పుడు ప్ర‌శంస‌లు.. :సెంచ‌రీ త‌ర్వాత కేఎల్ రాహుల్ రియాక్ష‌న్ 

click me!