బెడ్రూమ్ లో భార్యను పట్టించుకోని ధోనీ..సాక్షి ఏం చేసిందంటే..!

Published : Jul 05, 2023, 04:37 PM IST
బెడ్రూమ్ లో భార్యను పట్టించుకోని ధోనీ..సాక్షి ఏం చేసిందంటే..!

సారాంశం

అయితే, ఆయన ఓసారి మాత్రం పక్కనే తన భార్య సాక్షిని పట్టించుకోలేదట. ఈ విషయాన్ని సాక్షి స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలియని వారు ఉండరు. క్రికెట్ ప్రేమికులకే కాదు, క్రికెట్ గురించి అవగాహన లేనివారికి కూడా ధోనీ మాత్రం తెలిసే ఉంటుంది. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఆయన తన భార్య, బిడ్డలతో కూడా వీలైనంతగా సమయం గడుపుతుంటారు.

అయితే, ఆయన ఓసారి మాత్రం పక్కనే తన భార్య సాక్షిని పట్టించుకోలేదట. ఈ విషయాన్ని సాక్షి స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ధోనీకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో వీడియో గేమ్స్ ఆడటమన్నా, బైక్ రైడింగ్ కూడా అంతే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆయన చాలా సార్లు తెలియజేశారు.

అయితే, తాజాగా తన భార్య సాక్షి పక్కనే ఉండగా, ఆమెను పట్టించుకోకుండా వీడియో గేమ్స్ ఆడటం విశేషం. అయితే, తనను పట్టించుకోకుండా బెడ్రూమ్ లో తన భర్త వీడియో గేమ్స్ ఆడటాన్ని సాక్షి కి నచ్చలేదు. దీంతో, ఆమె అతని కాలు కొరుకడానికి ప్రయత్నించడం విశేషం. ఈ ఫోటోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా, అభిమానులను ఆకట్టుకుంటోంది. దానికి ఆమె క్యాప్షన్ గా భార్య వర్సెస్ వీడియో గేమ్స్ అంటూ క్యాప్షన్ పెట్టడం విశేషం. అయితే, ఇది  పాత పోస్ట్ కావడం విశేషం.

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !