నేను ఎంత చెప్పినా తక్కువే: పుజారాపై సునీల్ గవాస్కర్

By telugu teamFirst Published Jan 20, 2021, 10:54 AM IST
Highlights

ఆస్ట్రేలియాపై జరిగిన నాలుగో టెస్టు మ్యాచులో ఛతేశ్వర పుజారా ఆడిన తీరుపై సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. పుజారా ఇన్నింగ్స్ అత్యంత ప్రత్యేకమైందని గవాస్కర్ అన్నాడు.

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టు విజయంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అంజిక్యా రహానే నేతృత్వంలోని జట్టును ప్రశంసలతో ముంచెత్తాడు. అనూహ్యమైనది సాధించడానికి యువ భారత్ ఏ మాత్రం భయపడలేదని ఆయన అన్నాడు. భారత విజయాన్ని ఆయన ఇండియన్ క్రికెట్ విషయంలో మ్యాజిక్ మూమెంట్ గా అభివర్ణించాడు.

నిజంగానే ఇది మ్యాజిక్ అని, ఇండియన్ క్రికెట్ విషయంలో మ్యాజిక్ మూమెంట్, వారు రక్షించుకోవడానికి ఆడలేదని, వాళ్లు ఆటను విజయంతో ముగించాలని వాంఛించారని గవాస్కర్ అన్నాడు. యువ భారత్ అది సాధించిందని, యువ భారత్ మార్గం చూపించిందని, తాము భయపడడం లేదని చాటి చెప్పారని, ఏం విజయం.... ఎంతటి అద్భుతమైన విజయం అని అన్నాడు.

ఉదయం పూట శుభ్ మన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్సుతో అది ప్రారంభమైందని, మిడిల్ సెషన్ లో ఆస్ట్రేలియాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పాత గుర్రం చతేశ్వర్ పుజారా ఆడాడని గవాస్కర్ అన్నాడు.

బ్యాటింగ్ ఆర్డర్ లో ఐదో స్థానానికి రహానే రిషబ్ పంత్ ను ప్రమమెటో చేయడం రికార్డు సృష్టించిందని ఆయన అన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటిని తట్టుకుంటూ ఛతేశ్వర పుజారా నిలబబడి తీరు నాలుగో టెస్టు మ్యాచ్ ఐదో రోజు ఆటలో హైలెట్ అని అన్నాడు.

తరుచుగా పుజారా మందకొడి బ్యాటింగ్ మీద విమర్శలు వస్తుంటాయని, పుజారా యోధుడిలా పోరాటం చేశాడని అన్నాడు. పుజారా శరీరానికి దెబ్బలు తగిలాయని, వేళ్లకు, తలకు దెబ్బలు తగిలాయని, అయినా వెనక్కి తగ్గలేదని అన్ాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదని అన్నాడు.

పుజారా గురించి తాను ఎంత చెప్పినా తక్కువేనని అన్నాడు. భారత క్రికెట్ జట్టు కోసం, ఇండియా క్రికెట్ కోసం పుజారా తన దేహాన్ని అడ్డం పెట్టాడని అన్నాడు. గ్లౌవ్స్ మీద, శరీరం మీద, హెల్మెట్ మీద బంతులు తగిలాయని, అయినా వెనక్కి తగ్గలేదని గుర్తు చేశాడు. 

ఛతేశ్వర్ పుజారా వికెట్లకు మరో వైపు నిలబడడం యువ ఆటగాళ్ల విశ్వాసాన్ని పెంచిందని చెప్పాడు. రెండో సెషన్ లో వికెట్లు పడితే కష్టమయ్యేదని, అందువల్ల పుజారా ఇన్నింగ్స్ ప్రత్యేకమైందని అన్నాడు.  

ఆస్ట్రేలియా పూర్తి స్థాయి సామర్థ్యం గల జట్టుతో ఆడిందని, అందువల్ల భారత్ సిరీస్ విజయం అద్భుతమైందని గవాస్కర్ అన్నాడు. భారత క్రికెట్ భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

click me!