ఆసీస్‌పై అద్భుత విజయం... నంబర్ వన్‌గా టీమిండియా

By Siva KodatiFirst Published Jan 19, 2021, 5:54 PM IST
Highlights

బోర్డర్‌– గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్ట్‌‌లో టీమిండియ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ అద్బుత విజయంతో భారత జట్టుపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి

బోర్డర్‌– గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్ట్‌‌లో టీమిండియ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ అద్బుత విజయంతో భారత జట్టుపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

అటు బీసీసీఐ సైతం క్రికెటర్లకు నజరానా ప్రకటించింది. టీమ్ బోనస్ కింద జట్టుకు రూ.5 కోట్లు ఇస్తున్నట్లు తెలిపింది. మరోవైపు టీమిం‍డియా అద్భుత ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటింది.

ఆస్ట్రేలియాను సొంతగడ్డపై మట్టి కరిపించిన భారత జట్టు ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. గబ్బా టెస్టులో విజయంతో 430 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ ప్లేస్‌ కొట్టేసింది. భారత్‌ తర్వాత న్యూజిలాండ్‌ (420), ఆస్ట్రేలియా (332) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

Also Read:టెస్ట్ సిరీస్‌ సాధించడం చారిత్రాత్మకం..టీమిండియాపై పవన్‌, వెంకీ, అమితాబ్‌, షారూఖ్‌ ప్రశంసలు

ఇక ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో సంచలన విజయం సాధించిన టీమిండియా (117.65) ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండోస్థానంలో నిలిచింది. నిన్నటి వరకు ఈ ప్లేస్‌లో వున్న ఆస్ట్రేలియాను (113 పాయింట్లు) వెనక్కి నెట్టి ద్వితీయ స్థానాన్ని సొంతం చేసుకుంది.

కాగా పాకిస్తాన్‌తో ఇటీవల జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన కివీస్ (118.44) ప్రథమ స్థానంలో కొనసాగుతోంది

click me!