డైమండ్ డకౌట్ అయిన అశ్విన్.. అసలు ఏంటిది..? క్రికెట్‌లో ‘డక్’ ఔట్‌లు ఎన్ని రకాలు..?

Published : May 14, 2023, 10:25 PM ISTUpdated : May 14, 2023, 10:32 PM IST
డైమండ్ డకౌట్ అయిన అశ్విన్.. అసలు ఏంటిది..?  క్రికెట్‌లో ‘డక్’ ఔట్‌లు ఎన్ని రకాలు..?

సారాంశం

IPL 2023: ఐపీఎల్  -16 లో భాగంగా  రాజస్తాన్ రాయల్స్ - రాయల్ ఛాలెంజర్స్  మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ డైమండ్ డకౌట్ అయ్యాడు. అసలేంటీ డైమండ్ డక్..? 

క్రికెట్ లో ఒక ఆటగాడు, మరీ ముఖ్యంగా ఒక బ్యాటర్ కోరుకోనిది ఏదైనా ఉందా అంటే అది డకౌట్  (పరుగులేమీ చేయకుండా సున్నాకు అవుట్ అవడం)  అవడం.  అదీ  ఫస్ట్ బాల్ కే డకౌట్ అయితే మరీ దారుణం. తాజాగా  ఐపీఎల్  - 16 లో   భాగంగా రాజస్తాన్  - బెంగళూరు మధ్య ముగిసిన మ్యాచ్ లో   రాజస్తాన్  స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్  పరుగులేమీ చేయకుండానే   రనౌట్ అయ్యాడు.   రాజస్తాన్ ఇన్నింగ్స్  8వ ఓవర్లో   హెట్‌మెయర్  - అశ్విన్ లు రెండో పరుగు తీస్తుండగా  అనూజ్ రావత్  అశ్విన్ ను రనౌట్ చేశాడు.అశ్విన్ క్రీజును వదిలిన వెంటనే  కామెంటేటర్లు ఇలా  ఔట్ అయిన విధానాన్ని ‘డైమండ్ డకౌట్’ అని అభివర్ణించారు. అసలు ఈ డైమండ్ డకౌట్ అంటే ఏమిటి..?  క్రికెట్ లో ఎన్ని రకాల  ‘డకౌట్’ లు ఉన్నాయి. 

డైమండ్ డకౌట్ అంటే.. 

ఒక  మ్యాచ్ లో  బ్యాటింగ్ కు వచ్చిన ఓ ఆటగాడు   ఒక్క బంతి కూడా ఎదురుకోకుండా రనౌట్ అయితే దానిని  డైమండ్ డకౌట్ అంటారు.  నేడు అశ్విన్ ఔట్ అయింది  ఇలాగే.. 

 

డక్ ఔట్ లలో రకాలు : 

1. గోల్డెన్ డక్ :  ఇది అందరికీ  తెలిసిందే. ఒక బ్యాటర్  తాను ఎదుర్కున్న ఫస్ట్ బాల్ కే డకౌట్ అయితే దానిని గోల్డెన్ డకౌట్ అంటారు.  

2. సిల్వర్ డక్ : ఒక బ్యాటర్  పరుగులేమీ చేయకుండానే రెండో బాల్ కు ఔట్  అయితే అది సిల్వర్ డకౌట్. 

3. బ్రౌన్ డక్ : ఒక ఇన్నింగ్స్ లో ఒక బ్యాటర్ మూడో బాల్ కు అవుట్ అయితే  దానిని బ్రౌన్ డకౌట్ అని పిలుస్తారు. 

4. డైమండ్ డక్ : ఒక ఆటగాడు  ఇన్నింగ్స్ లో   ఒక్క బాల్ కూడా ఎదురుకోకుండా  రనౌట్ అయితే అది డైమండ్ డకౌట్. 

5. రాయల్ డక్ :  రాయల్ డకౌట్ ను ఎక్కువగా  యాషెస్ సిరీస్ లో వాడతారు.   ఆస్ట్రేలియా -  ఇంగ్లాండ్ మధ్య  జరిగే యాషెస్ సిరీస్ లో జరిగే ఐదు టెస్టు మ్యాచ్ లలో భాగంగా టెస్టు  మ్యాచ్ (ఐదింటిలో ఏదైనా) ఫస్ట్ బాల్ కే  డకౌట్ అయిన  బ్యాటర్ ను రాయల్ డకౌట్ అయ్యాడు అని పిలుస్తారు.  2013లో  యాషెస్ టెస్టు సిరీస్ లో భాగంగా  పెర్త్ వేదికగా ముగిసిన థర్డ్ టెస్ట్ లో ఇంగ్లాండ్ ఆటగాడు అలెస్టర్ కుక్  ఫస్ట్ బాల్ కే అవుటై  రాయల్ డకౌట్ అయ్యాడు. 

6. లాఫింగ్ డక్ : ఒక  ఇన్నింగ్స్ లో ఓ ఆటగాడు ఆఖరి బంతికి  పరుగులేమీ  చేయకుండా ఔటై.. ఆ బంతితోనే ఇన్నింగ్స్ ముగిస్తే  అప్పుడు  అలా అవుట్ అయిన  బ్యాటర్  ను లాఫింగ్ డకౌట్  అయ్యాడని అభివర్ణిస్తారు. 

7. ఎ పెయిర్ : దీనికి ఎక్కువగా టెస్టు క్రికెట్ లో వాడతారు. ఒక బ్యాటర్ వరుసగా రెండు ఇన్నింగ్స్ లలోనూ డకౌట్ అయితే  దానిని ‘ఎ పెయిర్’ అని అంటారు. 

8. కింగ్ పెయిర్ :  ఒక బ్యాటర్ ఒకే టెస్టులో రెండు  ఇన్నింగ్స్ లలోనూ ఫస్ట్ బాల్ కే డకౌట్ అయితే  అప్పుడు దానిని ‘కింగ్ పెయిర్’అని సంబోధిస్తారు. 

9. బ్యాటింగ్ హ్యాట్రిక్ : ఇది చాలా రేరెస్ట్ సిట్యూయేషన్ లో  జరిగేది. ఒక బ్యాటర్  వరుసగా మూడు టెస్టు ఇన్నింగ్స్ లలో  మూడు బంతుల్లో మూడు సార్లు డకౌట్ అయితే దానిని  బ్యాటింగ్ హ్యాట్రిక్ అని పిలుస్తారు. 
 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?