కరోనా: వెస్టిండీస్- ఆస్ట్రేలియా రెండో వన్డే వాయిదా..!

By telugu news teamFirst Published Jul 23, 2021, 10:43 AM IST
Highlights

వెస్టిండీస్ జట్టులోని ఓ ఆటగాడు కరోనా బారిన పడ్డాడని.. ఈ కారణంతో మ్యాచ్ ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది అనుకునేలోపు.. మళ్లీ కోవిడ్ మహమ్మారి విజృంభించడం మొదలుపెడుతోంది. ఎన్నో జాగ్రత్తల మధ్య అధికారులు క్రికెట్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నప్పటికీ.. పలువురు క్రికెటర్లు కరోనాకు బలైపోతున్నారు.

తాజాగా.. ఈ కరోనా మహమ్మారి కారణంగా వెస్టిండీస్ కి ఆస్ట్రేలియాకి మధ్య జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ వాయిదా పడింది. వెస్టిండీస్ జట్టులోని ఓ ఆటగాడు కరోనా బారిన పడ్డాడని.. ఈ కారణంతో మ్యాచ్ ని వాయిదా వేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

చివరి నిమిషంలో ఈ మ్యాచ్ వాయిదా పడటం గమనార్హం. గురువారం ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా... టాస్ వేసిన తర్వాత.. ఈ కరోనా పాజిటివ్ విషయం తెలియడంతో మ్యాచ్ వాయిదా వేశారు. ఇతర క్రికెటర్లందరికీ కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

అందరు క్రికెటర్లకు పరీక్షలు నిర్వహించి.. ఫలితం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు చెప్పారు.  కాగా.. క్రికెటర్లందరినీ ఐసీసీ( ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) బయో బబుల్ లో ఉంచి.. ఐసోలేషన్ తర్వాతే మ్యాచ్ నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఇలా పాజిటివ్ కేసులు రావడం అందరినీ కలవరపెడుతోంది. కాగా.. మ్యాచ్ వాయిదాతో అభిమానులు నిరాశకు గురయ్యారు. 

click me!