విండీస్ ప్లేయర్ బ్రాత్ వైట్ కు షాక్... ఐసిసి నోటీసులు జారీ

By Arun Kumar PFirst Published Sep 9, 2019, 2:45 PM IST
Highlights

వెస్టిండిస్ ఆటగాడు బ్రాత్ వైట్ కు ఐసిసి నోటీసులు జారీ చేసింది. ఇటీవల భారత్ తో జరిగిన చివరి  టెస్ట్ మ్యాచ్ లో ఐసిసి నిబంధలను అతిక్రమించాడన్న ఫీల్డ్  అంపైర్లు ఫిర్యాదుతో ఐసిసి ఈ నిర్ణయం తీసుకుంది.  

వెస్టిండిస్ పార్ట్ టైమ్ బౌలర్ క్రెయిన్ బ్రాత్ వైట్ కు ఐసిసి నోటీసులు జారీ చేసింది. అతడి బౌలింగ్ యాక్షన్ పై అనుమానాలున్నాయన్న అంపైర్ల పిర్యాదుపై  అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ స్పందించింది. 14 రోజుల్లోపు తాము నిర్వహించే బౌలింగ్ పరీక్షలకు హాజరుకావాల్సిందిగా ఐసిసి బ్రాత్ వైట్ ను ఆదేశించింది. అయితే అప్పటివరకు అతడు బౌలింగ్ కొనసాగించే వెసులుబాటును కూడా కల్పించింది. 
 
గతవారం భారత్-వెస్టిండిస్ ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో విండీస్ పార్ట్ టైమ్ బౌలర్ బ్రాత్ వైట్ బౌలింగ్ చేశాడు. అయితే అతడి  బౌలింగ్ యాక్షన్ ఐసిసి నిబంధలను లోబడి లేనట్లుగా ఫీల్డ్ అంపైర్లు గుర్తించారు. దీంతో వారు మ్యాచ్ నిర్వహకులతో పాటు ఐసిసికి ఫిర్యాదు చేశారు.

అంపైర్ల ఫిర్యాదుపై తాజాగా ఐసిసి స్పందిస్తూ బ్రాత్ వైట్ బౌలింగ్ యాక్షన్ ను పరీక్షించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు వెస్టిండిస్ మేనేజ్ మెంట్ కు కూడా ఐసిసి సమాచారం  అందించింది. 

గతంలోకూడా ఇలాగే బ్రాత్ వైట్ బౌలింగ్ యాక్షన్ పై అంపైర్లు పిర్యాదు చేయగా ఐసిసి పరీక్షలు నిర్వహించింది. కానీ అతడి బౌలింగ్ లో ఎలాంటి లోపం లేదని...నిబంధల ప్రకారమే యాక్షన్ వుందని ఐసిసి క్లీన్ చీట్ ఇచ్చింది. అదే ఐసిసి ఇప్పుడు మరోమారు అతడి బౌలింగ్ యాక్షన్ ను పరీక్షించాలని అనుకుంటోంది. 

అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటివరకు బ్రాత్ వైట్ మొత్తం 38 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. స్వతహాగా బ్యాట్స్ మెన్ అయిన అతడు అప్పుడప్పుడు పార్ట్ టైమ్ బౌలర్ గా జట్టుకు సేవలందిస్తుంటాడు. ఇలా అతడు ఇప్పటివరకు కేవలం 12 వికెట్లు మాత్రమే పడగొట్టినా అందులో ఆరు కేవలం ఒకే మ్యాచ్ లో సాధించినవి కావడం విశేషం.  
 

click me!