అంతర్జాతీయ క్రికెట్ కు వెస్టిండీస్ ఆటగాడు శామ్యూల్స్ గుడ్ బై

By telugu teamFirst Published Nov 4, 2020, 4:27 PM IST
Highlights

వెస్టిండీస్ ఆల్ రౌండర్ మార్లోన్ శామ్యూల్స్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. క్రికెట్ కు సంబంధించిన అన్ని ఫార్మాట్ల నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు శామ్యూల్స్ ప్రకటించాడు.

జమైకా: వెస్టిండీస్ ఆటగాడు మార్లోన్ శామ్యూల్స్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించాడు. బుధవారం ఆయన తన రిటైర్మెంట్ గురించి ప్రకటన చేశాడు. 2000లో ైసీసీ చాంఫియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అతను అడుగు పెట్టాడు. 

శామ్యూల్స్ 207 వన్డేలు, 71 టెస్టులు, 67 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 11,134 పరుగుుల చేశాడు. వాటిలో 17 సెంచరీలున్నాయి. అంతేకాకుండా అన్ని ఫార్మాట్లలో కలిపి 152 వికెట్లు తీశాడు. 2012, 2016 వెస్టిండీస్ టీ20 ప్రపంచ కప్ ట్రోఫీలు గెలుచుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 

2016 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో 85 పరుగులు చేసి టీ20 ఫైనల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2015 ప్రపంచ్ కప్ పోటీల్లో జింబాబ్వేతో జరిగిన మ్యాచులో క్రిస్ గేల్ తో కలిసి శామ్యూల్స్ రెండో వికెట్ కు 372 పరుగులు జోడించిన రికార్డు కూడా శామ్యూల్స్ పేర ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. 

2018 డిసెంబర్ తర్వాత శామ్యూల్స్ వెస్టిండీస్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వివాదాలకు కూడా అతను పెట్టింది పేరుగా మారాడు. ఇటీవల ఇంగ్లాండు క్రికెటర్ బెన్ స్టోక్స్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. దానిపై షేన్ వార్న్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతకు ముందు 2012లో బిగ్ బాష్ లీగ్ సందర్భంగా వార్న్ కు, శామ్యూల్స్ కు మధ్య పెద్ద గొడవనే జరిగింది.

click me!