విరాట్ ని ఇలా ఔట్ చేయాలి... విండీస్ కోచ్ సిమ్మన్స్

Published : Dec 05, 2019, 09:22 AM IST
విరాట్ ని ఇలా ఔట్ చేయాలి... విండీస్ కోచ్ సిమ్మన్స్

సారాంశం

తొలి టీ20కి ఉప్పల్ స్టేడియం ఇప్పటికే సిద్ధమవగా.. పిచ్‌ని బ్యాటింగ్‌కి అనుకూలంగా క్యూరేటర్ రూపొందించినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీకి ఈ స్టేడియంలో మెరుగైన రికార్డ్ ఉన్న నేపథ్యంలో.. ఇప్పుడు వెస్టిండీస్ బౌలర్ల దృష్టి అతనిపై పడింది

టీమిండియా... విండీస్ తో టీ20 మ్యాచ్ కోసం తలపడనుంది. ఈ మ్యాచ్ కి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మారింది. అయితే.. ఈ మ్యాచ్ లో టీమిండియా కోచ్ విరాట్ కోహ్లీ ని ఎలా ఔట్ చేయాలో విండీస్ కోచ్  ఫిల్ సిమ్మన్స్... తమ జట్టు సభ్యలకు సూచనలు చేశారు. కాగా... ఆ సూచనలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

కోహ్లీని ఔట్ చేయడానికి తమ వద్ద వ్యూహాలు ఉన్నాయని చెప్పుకొచ్చిన సిమన్స్.. వాటితో టీమిండియాను కట్టడి చేస్తామని చెప్పారు. ‘సిరీస్‌లో వెస్టిండీస్ ముందు ఉన్నది ఒకటే దారి. అది విరాట్ కోహ్లీకి కనీసం శతకం సమర్పించుకుని.. టీమ్‌లోని మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు భారీ స్కోర్లు చేయకుండా కట్టడి చేయడం. మొదట వెస్టిండీస్ బౌలర్లు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసి భయపడకుండా.. వ్యూహాలకి అనుగుణంగా బౌలింగ్ చేయాలి. మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో..? ఎవరికీ తెలీదు. అయినప్పటికీ విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు వ్యూహాలు రచించడం చాలా కష్టం’ అని సిమన్స్ వెల్లడించాడు.

తొలి టీ20కి ఉప్పల్ స్టేడియం ఇప్పటికే సిద్ధమవగా.. పిచ్‌ని బ్యాటింగ్‌కి అనుకూలంగా క్యూరేటర్ రూపొందించినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీకి ఈ స్టేడియంలో మెరుగైన రికార్డ్ ఉన్న నేపథ్యంలో.. ఇప్పుడు వెస్టిండీస్ బౌలర్ల దృష్టి అతనిపై పడింది. కోహ్లీని కట్టడి చేయడం ద్వారా... విండీస్ జట్టుని గెలిపించాలని చూస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?