6-1 తేడాతో గెలవాల్సింది! 4-3 తేడాతో గెలిచాం... పాకిస్తాన్‌పై టీ20 సిరీస్ నెగ్గిన ఇంగ్లాండ్...

By Chinthakindhi RamuFirst Published Oct 3, 2022, 11:47 AM IST
Highlights

England vs Pakistan: ఆఖరి టీ20లో 67 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న ఇంగ్లాండ్... 3-4 తేడాతో టీ20 సిరీస్ కైవసం... 

టీమిండియాతో రెండో టీ20లో సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ మెరుపు సెంచరీతో భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 పరుగులు చేసి దుమ్మురేపాడు. మిల్లర్ కిల్లింగ్ ఇన్నింగ్స్ కారణంగా 238 పరుగుల లక్ష్యఛేదనలో సఫారీ జట్టు టాపార్డర్‌లో ఇద్దరు డకౌట్ అయినా 221 పరుగులు చేయగలిగింది.ఇక్కడ డేవిడ్ మిల్లర్ సునామీ ఇన్నింగ్స్ ఆడిన సమయంలో పాకిస్తాన్‌పై ప్రతాపం చూపించాడు ఇంగ్లాండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్...

పాకిస్తాన్ పర్యటనలో 7 టీ20 మ్యాచుల సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్, ఆఖరి టీ20లో గెలిచి 4-3 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆఖరి టీ20లో 67 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది ఇంగ్లాండ్. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 209 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫిలిప్ సాల్ట్ 12 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేయగా ఆలెక్స్ హేల్స్ 13 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేశాడు...

డక్లెట్ 19 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసి రనౌట్ కాగా డేవిడ్ మలాన్ 47 బంతుల్లో 8 ఫోర్లు,3 సిక్సర్లతో 78 పరుగులు చేసి, హారీ బ్రూక్ 29 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. పాక్ బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో 17 పరుగులు సమర్పించడం విశేషం...

210 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులకి పరిమితమైంది. మహ్మద్ రిజ్వాన్ 1, బాబర్ ఆజమ్ 4, ఇఫ్తికర్ అహ్మద్ 19, కుష్‌దిల్ షా 27, అసిఫ్ ఆలీ 7, మహ్మద్ నవాజ్ 9, మహ్మద్ వసీం జూనియర్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. షాన్ మసూద్ 43 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 పరుగులు చేశాడు...

4-3 తేడాతో టీ20 సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ మొయిన్ ఆలీ... ‘ఇది కాస్త నిరుత్సాహాన్ని కలిగించింది. మేం 6-1 తేడాతో సిరీస్ గెలవాల్సింది. అయితే చాలామంది ప్లేయర్లు అందుబాటులో లేకపోవడం, మేం కొన్ని పొరపాట్లు చేయడంతో 4-3 తేడాతో గెలిచాం... టీ20 వరల్డ్ కప్ 2022 ముందు సిరీస్ గెలవడం సంతోషంగా ఉంది...’ అంటూ వ్యాఖ్యానించాడు...

2022లో స్వదేశంలో ఆస్ట్రేలియా చేతుల్లో టెస్టు సిరీస్ ఓడిపోయిన పాకిస్తాన్, తాజాగా ఇంగ్లాండ్ చేతుల్లో టీ20 సిరీస్ కూడా కోల్పోయింది. టీ20 వరల్డ్ కప్ 2022 ముగిసిన తర్వాత మరోసారి పాకిస్తాన్ పర్యటనకు వచ్చే ఇంగ్లాండ్ జట్టు, అక్కడ మూడు టెస్టుల సిరీస్ ఆడుతుంది. 

click me!