టీమిండియా చీఫ్ కోచ్ ఎంపిక... కపిల్ దేవ్ మద్దతు కూడా రవిశాస్త్రికేనా...?

By Arun Kumar PFirst Published Aug 2, 2019, 2:35 PM IST
Highlights

టీమిండియా చీఫ్ కోచ్ పదవికి కోసం మరోసారి పోటీ పడుతున్నరవిశాస్త్రికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా టీమిండియా మాజీ సారథి, సీఎసి సభ్యులు కపిల్ దేవ్ కూడా పరోక్షంగా శాస్త్రికే మద్దతిచ్చాడు.  

టీమిండియాకు నూతన కోచింగ్ సిబ్బంది కోసం బిసిసిఐ దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అలాగే ఈ దరఖాస్తులను పరిశీలించి సరైన వ్యక్తులను ఎంపిక చేసే బాధ్యతను మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)కి అప్పగించింది. అయితే చీఫ్ కోచ్ ఎంపికపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయగా... కపిల్ దేవ్ మాత్రం వాటిని సమర్ధించాడు. దీంతో ఆ పదవి కోసం ప్రదాన పోటీదారుగా నిలిచిన రవిశాస్త్రికి మరింత పెరిగినట్లయింది. 

భారత జట్టు వెస్టిండిస్ పర్యటనకు బయలేదేరే ముందు కోహ్లీ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తనతో పాటు అక్కడే వున్న రవిశాస్త్రిని ఉద్దేశించి మళ్లీ ఈయనే మాకు ప్రధాన కోచ్ గా వుంటే బావుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇలా ఓవైపు చీఫ్ కోచ్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండగానే కోహ్లీ బహిరంగంగానే ఇలా రవిశాస్త్రికి మద్దతివ్వడాన్ని కొందరు తప్పుబట్టారు. అయితే కపిల్ దేవ్ మాత్రం కోహ్లీ వ్యాఖ్యలను సమర్థించాడు. 

''విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్ గా తనకేం కావాలో తెలిపాడు. అతడి  అభిప్రాయాన్ని తప్పకుండా మేం గౌరవించాల్సిందే. అతడి అభిప్రాయాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. అందరి అభిప్రాయాలతో పాటు మా పరిశీలనలో టీమిండియా జట్టును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దగలడో వారికే కోచింగ్ పగ్గాలు అప్పగిస్తాం.'' అని తెలిపాడు. ఇలా కోహ్లీ వ్యాఖ్యలను కొట్టిపారేయకుండా పరిగణలోకి తీసుకుంటామంటూ కపిల్ దేవ్ కూడా పరోక్షంగా రవిశాస్త్రి అభ్యర్థిత్వాన్ని బలపర్చాడు.  

గతంలోనే మరో సీఏసీ  సభ్యుడు అన్షుమన్ గైక్వాడ్ కూడా రవిశాస్త్రికి మద్దతుగా మాట్లాడిన విషయం తెలిసిందే. అతడి పర్యవేక్షణలో భారత జట్టు మంచి ఫలితాలను సాధించిందంటూ గైక్వాడ్ ప్రశంసించాడు. ఇలా ముగ్గురు సభ్యుల సీఏసి లో ఇద్దరు రవిశాస్త్రి కి పరోక్షంగా మద్దతిచ్చారు. కేవలం శాంతా రంగస్వామి మాత్రమే సీఏసి నిర్ణయం మేరకే కొత్త కోచ్ ఎంపిక జరుగుతుందని... ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు, డిమాండ్ లను తాము పట్టించుకోబోమని చెబుతున్నారు.  

 

click me!