టీమిండియా బౌలింగ్ కోచ్ పదవిపై కన్నేసిన మాజీ బౌలర్

Published : Aug 01, 2019, 09:33 PM IST
టీమిండియా బౌలింగ్ కోచ్ పదవిపై కన్నేసిన మాజీ బౌలర్

సారాంశం

టీమిండియా బౌలింగ్ కోచ్ ల రేసులో మరో మాజీ బౌలర్ చేరాడు. కర్ణాటకకు చెందిన మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఈ పదవికోసం దరఖాస్తు చేసుకున్నాడు.   

టీమిండియా మాజీ ఆటగాడు వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. బిసిసిఐ భారత జట్టు కోసం నూతన కోచింగ్ సిబ్బందిని నియమించడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ  మాజీ బౌలర్ వెంకటేశ్ టీమిండియా బౌలింగ్ కోచ్ పదవిపై  కన్నేసి దరఖాస్తు కూడా చేసుకున్నాడు. 

గతంలో కూడా ఇతడికి భారత జట్టు బౌలింగ్ కోచ్ గా పనిచేసిన అనుభవం వుంది. 2007 నుండి 2009 వరకు ఇతడు కోచ్ గా వ్యవహరించాడు. ఈ సమయంలోనే టీమిండియా మొదటి ఐసిసి టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. కాబట్టి గత అనుభవం రిత్యా తనను బౌలింగ్ కోచ్ గా నియమించాలని కోరుతున్నాడు. తనకు అవకాశమిస్తే భారత  బౌలింగ్ విభాగాన్ని మరింత బలంగా తయారు చేస్తానని వెంకటేశ్ ప్రసాద్ తెలిపాడు. 

వెంకటేశ్ ప్రసాద్ టీమిండియా తరపున 161 వన్డేలు, 33  టెస్టులు ఆడాడు. అతడు తన వన్డే కెరీర్లో మొత్తం  196 వికెట్లు, టెస్టుల్లో 96 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపిఎల్ లో  కూడా అతడు చెన్నై, బెంగళూరు, పంజాబ్ జట్లుకు బౌలింగ్ కోచ్ గా పనిచేశాడు.  

 
 

PREV
click me!

Recommended Stories

IND vs BAN : తగ్గేదే లే.. బంగ్లాదేశ్ కు ఇచ్చిపడేసిన భారత్.. గ్రౌండ్‌లో హీట్ పుట్టించిన కెప్టెన్లు !
Vaibhav Suryavanshi : ఊచకోత అంటే ఇదే.. బంగ్లా బౌలర్లని ఉతికారేసిన వైభవ్ ! కోహ్లీ రికార్డు పాయే