నాన్నతో చాహల్ తొలి టిక్ టాక్... నెట్టింట జోక్స్

By telugu news teamFirst Published Mar 27, 2020, 10:19 AM IST
Highlights

నాన్నతో తొలి టిక్ టాక్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా.. ఆ ఫన్నీ వీడియో ఇప్పు డు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీమర్స్  ఆ టిక్ టాక్ వీడియో పై నెట్టింట జోక్స్ వేస్తున్నారు. ఆ వీడియో పై కడుపుబ్బా నవ్వే మీమ్స్ తయారు చేశారు. దీంతో.. ఇప్పుడు వీడియో వైరల్ గా మారింది.

టీమిండియా క్రికెటర్ చాహల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో చెలరేగిపోయి ఆడే చాహల్ బయట మాత్రం చాలా ఫన్నీగా ఉంటాడు. తాను నవ్వుతూ.. ఎదుటి వాళ్లను నవ్విస్తూ ఉంటాడు. తన తోటి క్రికెటర్లతో టిక్ టాక్ కూడా చేస్తుంటాడు. మ్యాచ్ అయిపోయిన వెంటనే ఓ మైక్ పట్టుకొని చాహల్ టీవీ అంటూ హంగామా చేస్తుంటాడు. 

Also Read ప్రేయసీకి లవ్ ప్రపోజ్ : నాలుగు ప్లాన్లు వేస్తే కానీ మ్యాక్స్‌‌వెల్‌కు వర్కవుట్ కాలేదట...

అయితే... ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో... ఇంట్లో ఖాళీగా ఉండలేక బోర్ కొడుతోందని మరో టిక్ టాక్ చేశాడు. ఈ సారి టిక్ టాక్ లో తనతోపాటు తన తండ్రిని కూడా చేర్చాడు. ఇద్దరూ కలిసి సినిమా డైలాగులు చెప్పారు. తర్వాత పాటకు డ్యాన్స్ కూడా వేశారు. 

My first TikTok video with dad 🙈🤗 Dad & Son ❤️ 🙏🏻 pic.twitter.com/DJklsz1bDH

— Yuzvendra Chahal (@yuzi_chahal)

 

ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన చాహల్.. నాన్నతో తొలి టిక్ టాక్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా.. ఆ ఫన్నీ వీడియో ఇప్పు డు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీమర్స్  ఆ టిక్ టాక్ వీడియో పై నెట్టింట జోక్స్ వేస్తున్నారు. ఆ వీడియో పై కడుపుబ్బా నవ్వే మీమ్స్ తయారు చేశారు. దీంతో.. ఇప్పుడు వీడియో వైరల్ గా మారింది.

చాహల్ గతంలో రోహిత్ శర్మ తో టిక్ టాక్ చేశాడు. అది కూడా చాలా ఫన్నీగా ఉండటం గమనార్హం. న్యూజిలాండ్ పర్యటన సమయంలో..చహల్‌ తన సహచర ఆటగాళ్లయిన రోహిత్‌ శర్మ, పేసర్ ఖలీల్ అహ్మద్ కలిసి ఈ టిక్ టాక్ వీడియో తీశాడు. కాగా ఆ వీడియోలో  ఓ బాలీవుడ్ సినిమా సీన్‌ని రీ క్రేయేట్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేశాడు. 

ఇందులో చహల్ తన జాకెట్‌ను తికమక వేసుకొని కింద పడుకోగా రోహిత్, ఖలీల్ అతని స్నేహితుల్లా నటించారు. వారు చేసిన కామెడీ సీన్.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. 

 ఈ వీడియోను చహల్‌ 'వీ ఆర్ బ్యాక్' అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి స్పందన కూడా హిలేరియస్ గా వస్తోంది. 

మామూలుగా అయితే.. చాహల్ ఐపీఎల్ ఆడాల్సి ఉండగా... కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
 

click me!