హార్దిక్ ఒడిలో నటాషా.. ఇంట్లోనే ఉండండి అంటూ...

Published : Mar 26, 2020, 11:38 AM ISTUpdated : Jul 15, 2020, 12:52 PM IST
హార్దిక్ ఒడిలో నటాషా.. ఇంట్లోనే ఉండండి అంటూ...

సారాంశం

బాలీవుడ్ నటి నటాషాతో తన ప్రేమను అందరికీ కన్ఫామ్ చేశాడు. కొత్త సంవత్సరం 2020 వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో స్పీడ్‌ బోట్‌లో విహరిస్తూ హార్దిక్ త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ తొడిగాడు. ఆ తర్వాత కేక్ కట్ చేసి తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 

అందరూ ఇంట్లోనే ఉండాలని.. ఎవరూ బయటకు రావొద్దంటూ టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రేయసి నటాషా... అభిమానులకు సందేశం ఇస్తోంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నటాషా కూడా తన అభిమానులకు ఇంట్లోనే ఉండాలని సూచించింది.

హార్దిక్ ఒడిలో నటాషా పడుకొని ఉన్న ఫోటోని షేర్ చేసి అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేసింది.గతంలో వారిద్దరూ విహారయాత్రకు వెళ్లినప్పటి ఫోటో అయ్యి ఉండొచ్చు. కాగా.. ఈ  ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టు.కుంటోంది.

 

ఇదిలా ఉండగా.. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి నటాషాతో తన ప్రేమను అందరికీ కన్ఫామ్ చేశాడు. కొత్త సంవత్సరం 2020 వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో స్పీడ్‌ బోట్‌లో విహరిస్తూ హార్దిక్ త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ తొడిగాడు. ఆ తర్వాత కేక్ కట్ చేసి తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 

ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పోస్టు చేసిన పాండ్యా.. 'నీకు నేను, నాకు నువ్వు, హిందుస్తాన్ మొత్తానికి ఇది తెలియాలి' అని క్యాప్షన్ పెట్టాడు.

 

తాజాగా... వీరిద్దిరికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో భారత జట్టుకు దూరంగా ఉంటున్న హార్దిక్‌ పాండ్యా తన ప్రియురాలు నటాషా స్టాన్‌కోవిచ్‌తో కలిసి విహారయాత్రలు కూడా చేశాడు. ఈ సమయం లో ఐపీఎల్ తో బిజీగా ఉండాల్సింది. కానీ కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !