వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ... భారీ ఆధిక్యం దిశగా టీమిండియా...

Published : Mar 05, 2021, 04:54 PM IST
వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ... భారీ ఆధిక్యం దిశగా టీమిండియా...

సారాంశం

హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వాషింగ్టన్ సుందర్... రిషబ్ పంత్‌తో కలిసి కీలక సమయంలో అమూల్యమైన భాగస్వామ్యం... పంత్ అవుటైన తర్వాత దూకుడు కొనసాగిస్తున్న సుందర్... 

కెరీర్‌లో నాలుగో టెస్టు ఆడుతున్న వాషింగ్టన్ సుందర్, మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌పై తొలి టెస్టులో 85 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్, ఆ తర్వాత ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు.

అయితే టీమిండియాకి అత్యంత ఆవశ్యకమైన సమయంలో రిషబ్ పంత్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన వాషింగ్టన్ సుందర్, 96 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

బెన్ స్టోక్స్, జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో కూడా తేలిగ్గా బౌండరీలు రాబట్టిన వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్ అవుటైన తర్వాత కూడా దూకుడు కొనసాగించాడు. 90 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసిన టీమిండియా, 85 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది