TG20 League : హర్షిత్ దెబ్బకు ఖమ్మం విలవి.. వరంగల్ వారియర్స్ వండర్ఫుల్ విక్టరీ

Published : Jun 24, 2026, 10:12 PM IST
TG20 League

సారాంశం

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం మరో సెంచరీ మోత మోగింది. ఇప్పటికే టీజి20 లీగ్ లో భాగంగా తిలక్ వర్మ, అమన్ రావ్ సెంచరీలు చేయగా తాజాగా హర్షిత్ చౌదరీ సెంచరీతో చెలరేగాడు. 

TG20 League : తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సరికొత్త ప్రయత్నం చేస్తోంది... అదే టీజి 20 లీగ్ (TG20 League).సేమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాదిరిగానే తెలంగాణ జిల్లాల పేరుతో ఈ టీ20 క్రికెట్ లీగ్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మొత్తం 8 జట్లు 21 రోజులపాటు 32 మ్యాచుల్లో తలపడనున్నాయి.

ఖమ్మంపై వరంగల్ దే పైచేయి

అయితే ఇవాళ (జూన్ 24, బుధవారం) మధ్యాహ్నం అన్విత ఖమ్మం ఏసెస్, వరంగల్ వారియర్స్ మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది.  మొదట బ్యాటింగ్ చేసిన ఖమ్మం 19.2 ఓవర్లలో 202 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ గుప్తా 54 పరుగులు (36 బంతుల్లో), మిక్కిల్ జైస్వాల్ 54 పరుగులు (22 బంతుల్లో) లతో మెరిశారు... దీంతో ఖమ్మం టీం డబుల్ సెంచరీ స్కోరు సాధించింది.

సెంచరీతో చెలరేగిన హర్షిత్

203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వరంగల్ వారియర్స్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్ హర్షిత్ చౌదరీ కేవలం 62 బంతుల్లోనే 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 121 పరుగులు (నాటౌట్) సాధించాడు... ఇతడి విధ్వంసకర బ్యాటింగ్ ముందు ఖమ్మం బౌలర్ల ఆటలు సాగలేవు... దీంతో కేవలం 18.5 ఓవర్లలోనే వరంగల్ లక్ష్యాన్ని చేధించి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Cricketers Padma Shri: రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే
Virat Kohli Marksheet : కోహ్లీకి టెన్త్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? హయ్యెస్ట్, లోయెస్ట్ ఏ సబ్జెక్టుల్లో?