వైజాగ్‌ ప్రీమియర్ లీగ్... విశాఖవాసులకి ఐపీఎల్ స్టైల్‌లో క్రికెట్ పండగ...

By team teluguFirst Published Dec 9, 2020, 4:24 PM IST
Highlights

నెలరోజులు... మొత్తం 49 మ్యాచ్‌లు...

10 జట్లు పాల్గొనే మెగా టోర్నీ...

ఐపీఎల్‌ తరహాలో విపీఎల్ టోర్నీ నిర్వహించడం చాలా అభినందనీయం...  - విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ

విశాఖవాసులకోసం ఓ మెగా క్రికెట్ లీగ్ సందడి షురూ కాబోతోంది. ఐపీఎల్ తరహాలోనే వైజాగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ 2020 టోర్నమెంట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. నెలరోజులపాటు సాగే ఈ మెగా క్రికెల్ లీగ్‌లో మొత్తం 49 మ్యాచ్‌లు జరుగుతాయి. వైజాగ్ ప్రీమియర్ లీగ్‌లో 10 జట్లు పాల్గొంటున్నాయి ఈ మెగా టోర్నీని డిసెంబర్ 9, బుధవారం రోజున రైల్వే స్టేడియంలో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ప్రారంభించారు.

కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచిన ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ... ‘ఆంధ్రప్రదేశ్‌కి పరిపాలనా రాజధానిగా మారుతున్న విశాఖ సిటీలో ఐపీఎల్‌ తరహాలో విపీఎల్ టోర్నీ నిర్వహించడం చాలా అభినందనీయం. ఈ మెగా టోర్నీ వల్ల నగర ఖ్యాతి మరింత పెరుగుతుంది. విశాఖలో క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తాం... విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ అన్ని విధాలా కృషి చేస్తున్నారు’ అని అన్నారు.

వీపీఎల్ నిర్వహకుడు, కేఆర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. రాజా మాట్లాడుతూ... ‘క్రీడాకారుల్లో దాగి ఉన్న టాలెంట్‌ను ప్రోత్సహించి, వారికి ఓ ఫ్లాట్‌ఫామ్ ఏర్పాటుచేయాలనే ఉద్దేశంతోనే ఈ మెగా టోర్నీ నిర్వహిస్తున్నాం. నెలరోజుల పాటు సాగేఈ టోర్నీలో అనేక మంది యువ క్రికెటర్ల పాల్గొంటున్నారు. విశాఖ రైల్వే గ్రౌండ్, స్టీల్ గ్రౌండ్‌లో ఈ మ్యాచులు నిర్వహిస్తాం’ అని చెప్పారు.

వీపీఎల్ టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, ఐఆర్‌ఎస్ అధికారి ఎం. ఈశ్వర్ హరినాథ్, తదితరులు పాల్గొన్నారు. 

click me!