పంత్, ఇషాన్ కాదు.. టీ20 ప్రపంచకప్ లో అతడిని వికెట్ కీపర్ గా తీసుకోవాలి : వీరేంద్ర సెహ్వాగ్

Published : May 08, 2022, 03:11 PM IST
పంత్, ఇషాన్ కాదు.. టీ20 ప్రపంచకప్ లో అతడిని వికెట్ కీపర్ గా తీసుకోవాలి : వీరేంద్ర సెహ్వాగ్

సారాంశం

IPL 2022: ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్నది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టు తరఫున ఎంపికయేందుకు పలువురు ఔత్సాహిక ఆటగాళ్లు..  ఐపీఎల్ లో తమ సత్తా ఏంటో చాటి  చెబుతున్నారు.

రాబోయే పొట్టి ప్రపంచకప్ తో పాటు  జాతీయ జట్టులో చోటు సంపాదించేందుకు క్రికెటర్లకు ఐపీఎల్  చక్కని వేదికనిస్తున్నది. రెండు నెలల పాటు సాగే ఈ మెగా టోర్నీలో రాణించి తద్వారా భారత జట్టులో చోటు సుస్థిరం చేసుకునేందుకు చాలా మంది యువ, ఔత్సాహిక ఆటగాళ్లు  ఆకట్టుకునే ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టి లో పడుతున్నారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్న ఆటగాళ్లలో పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ జితేశ్ శర్మ కూడా ఒకడు.  వికెట్ కీపర్ గానే గాక హిట్టర్ గా కూడా  అతడు అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్నాడు. పంజాబ్ లో ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్  కు వస్తున్న  జితేశ్..  ఆ సమయంలో హిట్టింగ్ కావల్సిన అన్ని లక్షణాలను వంటపట్టించుకున్నాడు. 

సీజన్ ఆసాంతం రాణిస్తున్న  జితేశ్.. తాజాగా రాజస్తాన్ రాయల్స్ తో శనివారం ముగిసిన మ్యాచ్ లో కూడా  సత్తా చాటాడు. 18 బంతుల్లోనే 38 పరుగులు చేసి పంజాబ్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కోరుతున్నాడు. 

పంజాబ్ తో మ్యాచ్ అనంతరం వీరూ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్ లో జితేశ్ అదరగొడుతున్నాడు. అతడికి ఐపీఎల్ లో తొలి సీజన్ అయినప్పటికీ మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. అతడిని  ఈ ఏడాది ఆస్ట్రేలియా లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ కు  పంపాలి.  దేశవాళీలో బాగా ఆడినవారిని  జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తారు కదా. జితేశ్ కూడా పంజాబ్ తో చేరకముందు దేశవాళీలో అద్భుతంగా రాణించాడు. అతడి ఆటను చూసే పంజాబ్.. వేలంలో అతడిని దక్కించుకుంది. అందుకు అతడి తగిన  న్యాయం కూడా చేస్తున్నాడు... 

ముఖ్యంగా రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ లో అతడు ఆడిన ఇన్నింగ్స్ ఓ అద్భుతం. ఆఖర్లో వచ్చినా   పంజాబ్ కు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.  ఇప్పటికే మనకు ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహాలు ఈ ఐపీఎల్ లో బాగానే మెరుస్తున్నారు. కానీ వీళ్లందరికంటే నాకు  జితేశ్ శర్మ ఆట  ఆకట్టుకుంటున్నది..’ అని తెలిపాడు. 

జితేశ్ శర్మ ఈ సీజన్ లో 9 మ్యాచులలో 162 పరుగులు చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ లో ఐదు లేదా ఆరు స్థానాలలో బ్యాటింగ్ కు వచ్చే జితేశ్ కు భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉండదు. ఆఖరి ఐదు ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం రావడమే అతడికి గొప్ప. చివర్లో వస్తున్నా హిట్టింగ్ కు దిగి  పంజాబ్ కు భారీ స్కోర్లు అందిచండంలో సఫలమవుతున్నాడు. మరోవైపు ఈ సీజన్ లో  ముంబై ఇండియన్స్ యాజమాన్యం రూ. 15.25 కోట్లు పెట్టి దక్కించుకున్న ఇషాన్ కిషన్.. ఈ సీజన్ లో అత్యంత చెత్త ఆటతీరుతో విమర్శల పాలవుతున్నాడు. రిషభ్ పంత్  అడపాదడపా ఆడుతున్నా నిలకడ లేదు.  ఇక సాహా మాత్రం అంచనాలకు మించి రాణిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ లో ఓపెనర్ గా వస్తున్న సాహా.. మెరుపు ఇన్నింగ్స్ తో లేటు వయసులో కూడా అదరగొడుతున్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు