IPL 2025: కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే పై సెహ్వాగ్ ఫైర్.. ఎందుకంటే?

Published : May 28, 2025, 03:59 PM IST
Ajinkya Rahane

సారాంశం

IPL 2025: గత ఐపీఎల్ లో ఛాంపియన్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్  2025 సీజన్ లో గొప్ప ప్రదర్శన చేయలేకపోయింది. ప్లేఆఫ్స్ చేరకుండానే ఐపీఎల్ 2025 నుంచి అవుట్ అయింది.

Virender Sehwag slams Ajinkya Rahane: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 తుదిదశకు చేరుకుంది. భారీ అంచనాలున్న కోలకతా నైట్ రైడర్స్ (KKR) ఈ సీజన్ లో నిరాశపరిచింది. గత సీజన్ లో ఛాంపియన్ గా నిలిచిన కేకేఆర్.. ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కూడా చేరకుండా టోర్నీ నుంచి అవుట్ అయింది. ఈ క్రమంలోనే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేపై భారత జట్టు మాజీ ఓపెనర్ విరేంద్ర సెహ్వాగ్ తీవ్ర విమర్శలు చేశారు.

రహానే టాప్-ఆర్డర్‌లో ఆడకుండా మిడిలార్డర్ లో ఆడటపై విమర్శలు చేశారు. జట్టు ప్రయోజనాల కంటే తన బ్యాటింగ్ ఆర్డర్ స్థానాని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉందని సెహ్వాగ్ విమర్శించాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 110 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఓటమితో కోలకతా లీగ్‌ నుంచి అవుట్ అయింది. కేకేఆర్ ప్రదర్శనపై సెహ్వాగ్ మాట్లాడుతూ.. "ఒక కెప్టెన్ తప్పనిసరిగా టాప్-3లో ఆడాల్సిందని ఎక్కడా రాయలేదంటూ" సెహ్వాగ్ క్రిక్‌బజ్‌తో అన్నారు. "పంత్‌ని చూడండి, అతను ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ముందుగా పంపించాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఫామ్ ఉన్న ప్లేయర్ల నుంచి అందుకోవాల్సిన ప్రయోజనాలు అందుకుంది" అని అన్నారు.

కేకేఆర్ కూడా ఇదే విధంగా చేయాల్సిందని పేర్కొన్నాడు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కోచింగ్ స్టాఫ్, జట్టు నిర్వహణ సిబ్బందిపై ఉంటుందని అన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్‌లో శివం దూబే, డెవాల్డ్ బ్రెవిస్‌లను ముందుగా పంపించింది. ఇటీవలి మ్యాచ్‌లతో పోలిస్తే వారి ఆర్డర్ మార్చారని" అన్నారు. మంచి ఫామ్ లో ఉన్న రహానే కూడా కేకేఆర్ కోసం ఓపెనర్ గా వచ్చివుంటే ఫలితాలు మరింత మెరుగ్గా వచ్చివుండేవని పేర్కొన్నాడు.

రహానే ఓపెనర్ గా రావకపోవడంపై మాట్లాడుతూ.. "నాకూ ఓపెనర్‌గా ఆడాలని ఉంటుంది. ముష్తాక్ అలీ టోర్నమెంట్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తూ నేను 469 పరుగులు చేశాను. కానీ ఇది జట్టు అవసరాలపై ఆధారపడి ఉంటుంది" అని చెప్పారు. ఐపీఎల్ 2025లో రహానే కేకేఆర్ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనింగ్ స్థానంలో క్వింటన్ డీకాక్ స్థిరంగా ఉండడం, అలాగే గత సీజన్‌లో సునీల్ నరైన్ ఆరంభంలో పరుగులు చేయడంలో సక్సెస్ కావడంతో రహానే మూడో స్థానానికి పరిమితం అయ్యారని సమాచారం. "డిఫెండింగ్ చాంపియన్ గా లీగ్‌లో ప్రవేశించడం అంటే ఒత్తిడిగా ఉంటుంది. కానీ జట్టు మొత్తంగా అలాంటి ఫలితం కోసం శ్రమించింది. మేము తిరిగి బలంగా మళ్లీ రాగలమని నమ్ముతున్నాను" అని రహానే అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !