ఆఖరి టెస్టు నేను ఆడతా... వీరేంద్ర సెహ్వాగ్

Published : Jan 13, 2021, 08:07 AM IST
ఆఖరి టెస్టు నేను ఆడతా... వీరేంద్ర సెహ్వాగ్

సారాంశం

ఆఖరి టెస్టులో టీమిండియా ఎలా ఉంటుందో అనే కంగారు అందరిలోనూ ఉంది. జట్టులోని కీలక ఆటగాళ్లంతా గాయాలపాలై టెస్టుకి దూరమవ్వడంతో.. అసలు నాలుగో టెస్టు ఆడటానికి క్రికెటర్స్ ఉన్నారా అనే సందేహాలు మొదలయ్యాయి. 

టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి.  ఆస్ట్రేలియా పర్యటన మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 13 మంది ఆటగాళ్లు గాయపడ్డారు. మూడో టెస్టులో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు గాయాలబాట పట్టారు. సిడ్నీ వేధికగా జరిగిన మూడో టెస్టులో సైతం రిషభ్ పంత్, హనుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రాలు గాయాలపాలైన సంగతి తెలిసిందే.

అయితే.. వాళ్లలో బుమ్రా, విహారి, బజేజా నాలుగో టెస్టుకు దూరమైనట్లు ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. కాగా.. పంత్, అశ్విన్ విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొంది. దీంతో.. ఆఖరి టెస్టులో టీమిండియా ఎలా ఉంటుందో అనే కంగారు అందరిలోనూ ఉంది. జట్టులోని కీలక ఆటగాళ్లంతా గాయాలపాలై టెస్టుకి దూరమవ్వడంతో.. అసలు నాలుగో టెస్టు ఆడటానికి క్రికెటర్స్ ఉన్నారా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ పరిస్థితి సీనియర్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు.

బుమ్రా, షమి, ఉమేశ్, కేఎల్ రాహుల్, జడేజా, విహారి టెస్టు సిరీస్ కి దూరమయ్యారని తెలుపుతూ సెహ్వాగ్ ఓ ట్వీట్ చేశాడు. ఓ ఫోటో షేర్ చేసి దానికి క్యాప్షన్ గా ఎంతో మంది ఆటగాళ్లు గాయపడ్డారు. అయితే.. నాలుగో టెస్టుకు 11మంది ఆటగాళ్లు లేకపోతే చెప్పండి. జట్టులో చేరడానికి నేను రెడీగా ఉన్నాను. క్వారంటైన్ నిబంధనల గురించి తర్వాత ఆలోచిద్దాం’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026: ఐసీసీకి అంబానీ జియో హాట్‌స్టార్ షాక్
SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం