మహ్మద్ సిరాజ్‌కి సారీ చెప్పిన డేవిడ్ వార్నర్... మా వాళ్లు అలా చేస్తారని అనుకోలేదని...

By team teluguFirst Published Jan 12, 2021, 12:39 PM IST
Highlights

సిడ్నీ గ్రౌండ్‌లో సిరాజ్ ఎదుర్కొన్న చేదు అనుభవానికి క్షమాపణలు కోరిన డేవిడ్ వార్నర్...

భారత జట్టు బాగా ఆడిందంటూ అభినందన... 

సొంత మైదానంలో మా వాళ్లు ఇలా ప్రవర్తిస్తారని ఊహించలేదంటూ కామెంట్..

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన మంచితనంతో భారతీయుల మనసు గెలుచుకుంటూనే ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా తెలుగువారికి దగ్గరైన వార్నర్, టిక్ టాక్ వీడియోలతో మరింత దగ్గరయ్యాడు.

ఆడిలైడ్ టెస్టులో భారత జట్టు చెత్త ప్రదర్శన తర్వాత ‘వాళ్లు తిరిగి కమ్‌బ్యాక్’ ఇస్తారని భరోసా ఇచ్చిన వార్నర్... తమ తరంలో విరాట్ కోహ్లీయే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అంటూ నిర్మొహమాటంగా ప్రకటించాడు. తాజాగా మరోసారి భారతీయుల మనసు గెలిచాడు డేవిడ్ వార్నర్.

సిడ్నీ టెస్టులో భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌పై ఆస్ట్రేలియా ప్రేక్షకుల్లోని కొందరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. ఈ ‘రేసిజం’ కామెంట్ల ఇష్యూ చాలా సీరియస్ అయ్యింది కూడా. సిడ్నీ టెస్టు ముగిసిన తర్వాత దీనిపై స్పందించిన వార్నర్... సిరాజ్‌కు, టీమిండియాకు క్షమాపణలు తెలిపాడు.

‘మళ్లీ క్రికెట్ ఆడడం చాలా గొప్పగా ఉంది. అయితే ఆశించిన రిజల్ట్ రాలేదు. ఇది టెస్టు క్రికెట్. ఐదు రోజుల పాటు పోటాపోటీగా మ్యాచ్ జరిగింది. డ్రా కోసం విరోచితంగా పోరాడిన టీమిండియాకు కంగ్రాట్స్... నేను సిరాజ్‌కి, భారత జట్టుకి క్షమాపణలు చెబుతున్నా. రేసిజం వ్యాఖ్యలు ఎక్కడైనా, ఎప్పుడైనా అంగీకారయోగ్యం కాదు. సొంత గ్రౌండ్‌లో సొంత జనాలు ఇలా చేస్తారని ఊహించలేదు. మా వాళ్లు మంచి ప్రవర్తిస్తారని అనుకున్నా’ అంటూ పోస్టు చేశాడు వార్నర్.

click me!