సిరీస్ కోల్పోయిన టీమిండియా, కోహ్లీపై విమర్శలు... అండగా నిలిచిన చిన్ననాటి కోచ్

By telugu news teamFirst Published Mar 3, 2020, 1:48 PM IST
Highlights

దూకుడుతనం, దుష్ప్రవర్తనకు మధ్య తేడా విరాట్ కి బాగా తెలుసని.. వాటి మధ్య ఉన్న సన్నని తేడా విరాట్ కి ఎప్పుడూ గుర్తుంటుందని.. ఆ గీతను ఎప్పుడూ దాటడని చెప్పారు. కోహ్లీలో ఉన్న దూకుడుతనమే అతనిని ఆ స్థానంలో నిలబెట్టిందని చెప్పారు.
 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ఆయన చిన్ననాటి కోచ్ అండగా నిలిచారు. న్యూజిలాండ్ పర్యటనలో ఇటీవల టీమిండియా పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఎక్కువగా విమర్శలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కి ఆయన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ మద్దతుగా నిలిచారు.

కోహ్లీ తానేంటో తరువాతి సిరిస్ లో తానేంటో నిరూపించుకుంటాడని రాజ్ కుమార్ శర్మ అభిప్రాయపడ్డారు. డీవై పాటిల్ టీ20 కప్ సందర్భంగా ముంబయికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రెండో టెస్టులో విలియమ్సన్ ఔటైన సందర్భంలో కోహ్లీ ప్రవర్తించిన తీరుపై కూడా ఆయన స్పందించారు.

Also Read అతను కెప్టెన్ గా పనికి రాడు: మైకేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు...

దూకుడుతనం, దుష్ప్రవర్తనకు మధ్య తేడా విరాట్ కి బాగా తెలుసని.. వాటి మధ్య ఉన్న సన్నని తేడా విరాట్ కి ఎప్పుడూ గుర్తుంటుందని.. ఆ గీతను ఎప్పుడూ దాటడని చెప్పారు. కోహ్లీలో ఉన్న దూకుడుతనమే అతనిని ఆ స్థానంలో నిలబెట్టిందని చెప్పారు.

కాగా.. న్యూజిలాండ్ పర్యటనలో కోహ్లీ చేసింది కేవలం 218 పరుగులే. కాగా దీనిపై ఆయన మాట్లాడారు. ఒక్కో సారి ప్రతి క్రికెటర్ ఇలాంటి దశ ఎదురౌతుందని.. అదేమీ పెద్ద సమస్య కాదన్నారు. విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని... మొన్నటి సిరీస్ లో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకున్నాడని చెప్పారు. దక్షిణాఫ్రికాతో రాబోయే వన్డే సిరీస్ లో కోహ్లీ తానేంటో నిరూపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

తాను కోహ్లీతో తరచుగా మాట్లాడుతూ ఉంటానని చెప్పారు. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా చర్చిస్తానని.. కోహ్లీ ఒక్కోసారి బాగా ఆడుతూ కూడా సడెన్ గా ఔట్ అవుతూ ఉంటాడని చెప్పారు. అయితే.. మొన్నటి సిరీస్ లో కివీస్ ఆటగాళ్లను మెచ్చుకోవాల్సిందేనన్నారు. మొత్తం జట్టును కట్టడి  చేసి సిరీస్ గెలిచారని చెప్పారు. 

click me!