నా చివరి రోజు వరకు ఆర్సీబీతోనే.. విరాట్ కోహ్లీ క్లారిటీ..!

By telugu news teamFirst Published Oct 12, 2021, 10:05 AM IST
Highlights

బెంగళూరు నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 19.4 ఓవర్‌లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఓటమితో ఆర్సీబీ లీగ్ నుంచి నిష్క్రమించింది. 
 


ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ బెంగళూరుకు చుక్కెదురైంది. కనీసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోహ్లీ సేన ఓటమి పాలైంది. బెంగళూరు నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 19.4 ఓవర్‌లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఓటమితో ఆర్సీబీ లీగ్ నుంచి నిష్క్రమించింది. 

ఓటమి తర్వాత కోహ్లీ మీడియాతో మాట్లాడారు. ‘‘కెప్టెన్‌గా యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చి.. వారు స్వేచ్ఛగా ఆడగలిగేలా చేశాను. టీమిండియా సారథిగా కూడా ఇదే పని చేశాను. నా బెస్ట్‌ ఇచ్చాను. ఇక ఆర్సీబీ ఫ్రాంఛైజీ కోసం వందకు 120 శాతం బెస్ట్‌ ఇచ్చేందుకు కృషి చేశాను. ఇప్పుడు ఆటగాడిగా కూడా అదే స్థాయిలో కష్టపడతాను.

కచ్చితంగా.. ఆర్సీబీలోనే ఉంటాను. వేరే జట్టులో ఆడటాన్ని నేను అస్సలు ఊహించలేను. ఇతర సంతోషాల కంటే... విశ్వాసపాత్రుడిగా ఉండటమే నాకు ముఖ్యం. నేను ఐపీఎల్‌ ఆడినంత వరకు.. ఈ టోర్నీలో నా చివరి రోజు వరకు ఆర్సీబీలోనే ఉంటాను’’ అని స్పష్టం చేశాడు. కాగా ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి.. 140 మ్యాచ్‌లలో 66 గెలిచాడు. 70 మ్యాచ్‌లలో ఓడిపోయాడు. నాలుగింటిలో ఫలితం తేలలేదు. సారథిగా 2016లో ఆర్సీబీని ఫైనల్‌ చేర్చిన కోహ్లి.. ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోయాడు.
 

click me!