‘బాపూ... బౌలింగ్ అదరగొట్టావ్...’ అక్షర్ పటేల్‌ను టీజ్ చేసిన విరాట్ కోహ్లీ...

Published : Feb 26, 2021, 12:46 PM IST
‘బాపూ... బౌలింగ్ అదరగొట్టావ్...’ అక్షర్ పటేల్‌ను టీజ్ చేసిన విరాట్ కోహ్లీ...

సారాంశం

రెండో టెస్టులోనూ 11 వికెట్లు తీసి సత్తా చాటిన అక్షర్ పటేల్... వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో ఐదేసి వికెట్ల ప్రదర్శన...  

ఆడిన రెండో టెస్టులోనూ 11 వికెట్లు తీసి అదరగొట్టాడు అక్షర్ పటేల్. రెండో ఇన్నింగ్స్‌లో మొదటి ఓవర్‌ మొదటి మూడు బంతుల్లోనే రెండు వికెట్లు తీసిన అక్షర్ పటేల్, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు.

మ్యాచ్ అనంతరం హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌ను ఇంటర్వ్యూ చేశాడు.సొంత ప్రేక్షకుల ముందు రాణించడం సంతోషంగా ఉందని చెప్పాడు అక్షర్ పటేల్. హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ... ‘ఏ బాపూ తారి బౌలింగ్ కమాల్ చే’ అంటూ గుజరాతీలో కామెంట్ చేసి వెళ్లిపోయాడు.

కోహ్లీ అన్న మాటలకు అర్థం ఏంటని చాలా మంది నెటిజన్లు ప్రశ్నించగా, ‘బాపూ... నీ బౌలింగ్ అద్భుతంగా ఉంది’ అన్నట్టు తెలిపారు గుజరాతీలు. బీసీసీఐ పోస్టు చేసిన ఈ వీడియోను మీరు కూడా చూసేయండి. 

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ