విలియమ్స్ కి విరాట్ కోహ్లీ నోట్ బుక్ పంచ్..

By telugu teamFirst Published Dec 7, 2019, 9:08 AM IST
Highlights

ఈ మ్యాచ్ లో అన్నింటికన్నా ఎక్కువగా... కోహ్లీ నోట్ బుక్ పంచ్ అందరి  దృష్టి ఆకర్షించింది. ఇంతకీ మ్యాటరేంటంటే... 2017లో భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో విలియమ్స్ విరాట్ ఔట్ అవ్వగానే... జేబులో నుంచి నోట్ బుక్ తీసి టిక్ మార్క్ చేసి సంబరాలు చేసుకున్నాడు.

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విజృంభించాడు. భారత్, వెస్టిండీస్ క్రికెటర్లు నువ్వా నేనా అన్నట్లు పోటీపడి భారీ షాట్లు ఆడటంతో.. తొలి టీ20లో ఏకంగా 416 పరుగులు నమోదయ్యాయి. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (94 నాటౌట్: 50 బంతుల్లో 6x4, 6x6), ఓపెనర్ కేఎల్ రాహుల్ (62: 40 బంతుల్లో 5x4, 4x6) చెలరేగడంతో లక్ష్యాన్ని భారత్ జట్టు మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. 

అయితే... ఈ మ్యాచ్ లో అన్నింటికన్నా ఎక్కువగా... కోహ్లీ నోట్ బుక్ పంచ్ అందరి  దృష్టి ఆకర్షించింది. ఇంతకీ మ్యాటరేంటంటే... 2017లో భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో విలియమ్స్ విరాట్ ఔట్ అవ్వగానే... జేబులో నుంచి నోట్ బుక్ తీసి టిక్ మార్క్ చేసి సంబరాలు చేసుకున్నాడు.

కాగా... నిన్నటి మ్యాచ్ లో... నోట్ బుక్ టిక్ మార్క్ కి కోహ్లీ సమాధానం ఇచ్చాడు. విలియమ్స్ బౌలింగ్ లో సిక్స్ కొట్టిన కోహ్లీ వెంటనే.. టిక్ మార్క్ చేస్తున్నట్లు యాక్ట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కోహ్లీ బలే పంచ్ ఇచ్చాడంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు.

కాగా.. తాను అలా సంబరాలు చేసుకోవడంపై కూడా కోహ్లీ స్పందించాడు. జమైకాలో తాను ఔట్ అయినప్పుడు విలియమ్స్ అలా చేశాడని కోహ్లీ గుర్తు చేసుకున్నారు. ‘అప్పటి నుండి నోట్ బుక్ లో టిక్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ అన్నీ మంచివే రాసుకోవాలని అనుకున్నాను. మ్యాచ్ కోసం చాలా కష్టపడి ఆడతాం.. చివరకు అందరం హాయిగా నవ్వేసుకుంటాం. కష్టపడి ఆడండి. ప్రత్యర్థులకు గౌరవం ఇవ్వండి’ అని కోహ్లీ పేర్కొన్నారు.

click me!