ఇంగ్లాండ్ వన్డే సిరీస్.. స్టన్నింగ్ క్యాచ్ తో అదరగొట్టిన కోహ్లీ

By telugu news teamFirst Published Mar 29, 2021, 10:22 AM IST
Highlights

ఆదివారం ఈ రెండు జట్ల మధ్య వన్డే చివరి మ్యాచ్ జరిగింది. చాలా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో చివరికి విజయం భారత్ కే దక్కింది

టీమిండియా వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. భారత పర్యటనలో ఇంగ్లాండ్ కి చేదు అనుభవమే మిగిలింది. ఒక్క సిరీస్ కూడా కైవసం చేసుకోలేకపోయింది. అన్నీ సిరీస్ లు టీమిండియానే దక్కించుకుంది. కాగా.. ఆదివారం ఈ రెండు జట్ల మధ్య వన్డే చివరి మ్యాచ్ జరిగింది. చాలా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో చివరికి విజయం భారత్ కే దక్కింది. కాగా.. ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టిన ఓ స్టన్నింగ్ క్యాచ్ ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

40వ ఓవర్ వేసిన శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్ (19: 22 బంతుల్లో 2x4) బంతిని కవర్స్ దిశగా ఫుష్ చేసి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే.. ఠాకూర్ తెలివిగా స్లో డెలివరీని విసరడంతో.. రషీద్ బ్యాట్ తాకిన బంతి షార్ట్ కవర్‌లో కొద్దిగా గాల్లోకి లేచింది.

 

pic.twitter.com/JwXOShzgEl

— Kalyan Paul (@paulkalyan17)

రషీద్ కొట్టిన బంతి గాల్లోకి లేవడంతో సిల్లీ మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తూ కనిపించిన విరాట్ కోహ్లీ మెరుపు వేగంతో కదిలి.. ఎడమ చేతి వైపు డైవ్ చేసి ఒంటిచేత్తో బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. బంతి క్యాచ్‌గా దొరికిన తీరుకి విరాట్ కోహ్లీనే ఫస్ట్ ఆశ్చర్యపోతూ కనిపించాడు. అప్పటికి ఇంగ్లాండ్ విజయానికి 65 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి ఉండగా.. చివరికి ఆ జట్టు 322/9కే పరిమితమైంది. మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన శార్ధూల్ ఠాకూర్ 67 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

click me!