Virat Kohli : అంపైర్ తో విరాట్ కోహ్లీ గొడ‌వ‌.. కోపానికి శిక్ష ప‌డింది..

By Mahesh Rajamoni  |  First Published Apr 22, 2024, 10:57 PM IST

Virat Kohli : ఆదివారం జరిగిన ఐపీఎల్ 2024 36వ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చివరి బంతికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఔటవ్వడంతో సహనం కోల్పోయి అంఫైర్ పై ఫైర్ అయ్యారు.
 


IPL 2024, Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 36వ మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు త‌ల‌ప‌డ్డాయి. ఇరు జ‌ట్ల‌ మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో కేకేఆర్ చివరి బంతికి ఒక పరుగు తేడాతో ఆర్సీబీ పై విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో ఔట్ అయిన త‌ర్వాత స‌హ‌నం కోల్పోయిన విరాట్ కోహ్లీ ఎంపైర్ల నిర్ణ‌యంపై మండిప‌డుతూ ఫైర్ అయ్యారు. గ్రౌండ్ లో ఎంఫైర్ల తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు.

ఇప్పుడు ఈ విష‌యంలో కోహ్లీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గట్టి శిక్ష విధించింది. కింగ్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. కోహ్లీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు బీసీసీఐ నిర్ధారించింది. ఈ కేసులో చర్యలు తీసుకుంటూ కోహ్లీకి ఈ శిక్షను విధించింది. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలోని కోల్ క‌తా జట్టు ఆర్సీబీకి 223 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, దానికి ప్రతిస్పందనగా బెంగళూరు జట్టు దూకుడుతో బ్యాటింగ్ ప్రారంభించింది. కానీ, ఆ తర్వాత మూడో ఓవర్ తొలి బంతిని హర్షిత్ రాణా నడుముపైకి వ‌చ్చే బౌన్స‌ర్ వేయగా, ఆ బంతిపై కోహ్లీ ఆన్ సైడ్ లో షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, బౌల‌ర్ చేతిలోనే క్యాచ్ రూపంలో దొరికిపోయాడు.

Latest Videos

కోహ్లీ వెంటనే నో బాల్ కు సంబంధించి డీఆర్ ఎస్ తీసుకోగా టీవీ అంపైర్ హాక్ ఐ సిస్టమ్ ను ఉప‌యోగించి ఆది పెయిర్ డెలివ‌రీ అని తేల్చుతూ కోహ్లీని ఔట్ గా ప్ర‌క‌టించాడు. దీంతో అగ్ర‌హంతోనే  క్రీజు నుంచి కోహ్లీ ముందుకు కదిలాడు. టీవీ అంపైర్ కూడా కోహ్లీని ఔట్ అని నిర్ణ‌యం వెల్ల‌డించ‌డంతో కోపోద్రిక్తుడైన కోహ్లీ ఫీల్డ్ అంపైర్ ను నిలదీశాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా కోహ్లీకి మద్దతుగా నిలిచి అంపైర్ తో మాట్లాడాడు. అయినా ఒక‌సారి నిర్ణ‌యం ప్ర‌క‌టించిన త‌ర్వాత క్రీజు వ‌ద‌ల‌క త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే  డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తుండగా కోహ్లీ కోపంగా మైదానంలో బ్యాట్ కొట్టాడు. అలాగే, డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తూ.. డస్ట్ బిన్ ను కూడా కొట్టాడు. కోహ్లీ గ్లౌజులు త‌గిలి కింద‌ప‌డ్డాయి. ఈ ప్రవర్తనను తప్పుగా భావించిన బీసీసీఐ కోహ్లీకి జరిమానా విధించింది.

యంగ్ 'ఫిడే క్యాండిడేట్‌'గా చరిత్ర సృష్టించిన భార‌త‌ చెస్‌ ప్లేయర్ గుకేష్

Virat Kohli To Empire Ben Stokes 💀
Angry mode of Virat Kohli 🔥
Third umpire❌️
Third class umpire ✅️ pic.twitter.com/IheoA8sDb4

— Aamir Majid FC (@AamirMajidFC)

 

IPL 2024 : వ‌రుస ఓటమి బాధ‌లో ఉన్న ఆర్సీబీకి మ‌రో బిగ్ షాక్.. 

click me!