RCB: మరో ఉత్కంఠభరితమైన ఐపీఎల్ 2024 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 1 పరుగు తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ను ఓడించింది. వరుస ఓటములు, విరాట్ కోహ్లీ ఔట్ రచ్చ మధ్య ఆర్సీబీకి మరో షాక్ తగిలింది.
Royal Challengers Bangalore : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ లో భాగంగా ఆదివారం జరిగిన ఉత్కంఠభరితమైన ఐపీఎల్ 36వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) 1 పరుగు తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పై విజయం సాధించింది. అయితే, వరుస ఓటములతో నిరాశలో ఉన్న ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌కు సంబంధించి చేదు వార్త వచ్చింది. ఒక్క తప్పిదం వల్ల ఫాఫ్ డు ప్లెసిస్ రూ.12 లక్షల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఇప్పటివరకు 8 మ్యాచ్‌లలో 7 ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచి 2 పాయింట్లు సాధించింది ఆర్‌సీబీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నికర రన్ రేట్ -1.046 గా ఉంది. ఇలాంటి సమయంలో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు బెంగళూరు టీమ్ కు జరిమానా పడింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ చేసిన తొలి ఉల్లంఘన క్రమంలో స్లో ఓవర్ రేట్‌కు పాల్పడిన ఫాఫ్ డు ప్లెసిస్‌కు బీసీసీఐ భారీ శిక్ష విధించింది.
IPL 2024 : అయ్యో విరాట్ కోహ్లీ.. కేకేఆర్ దెబ్బకు ప్లేఆఫ్ రేసు నుంచి ఆర్సీబీ ఔట్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్లో ఓవర్ రేటు జట్టు శిక్షను ఫాఫ్ డు ప్లెసిస్ ఒక్కడే భరించాల్సి ఉంటుంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌కు జరిమానా విధించినట్లు ఐపిఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఐపీఎల్ 2024 సీజన్‌లో అతని జట్టు చేసిన మొదటి ఉల్లంఘన కాబట్టి దీని కోసం రూ. 12 లక్షల జరిమానా విధించబడింది. ఫాఫ్ డు ప్లెసిస్ మరోసారి స్లో ఓవర్ రేట్‌కు పాల్పడినట్లు తేలితే, అతనికి రూ. 24 లక్షల జరిమానా విధిస్తారు. అలాగే, జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లోని ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా మిగిలిన ఆటగాళ్లకు రూ. ఒక్కొక్కరికి రూ.25 లేదా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా (ఏది తక్కువైతే అది) విధిస్తారు. ఇక ఈ సీజన్‌లో కెప్టెన్ మూడోసారి స్లో ఓవర్ రేట్‌కు పాల్పడినట్లు రుజువైతే, రూ.30 లక్షల జరిమానాతో పాటు, కెప్టెన్‌పై ఒక ఐపీఎల్ మ్యాచ్ నిషేధం ఉంటుంది.
ఐపీఎల్ లో మరో రచ్చ.. విరాట్ కోహ్లీ ఔట్ పై ఎంపైర్ నిర్ణయం సరైందేనా...? అసలేం జరిగింది?