డ్యాన్స్ తో అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో చూశారా..?

Published : Oct 17, 2022, 11:21 AM IST
 డ్యాన్స్  తో అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో చూశారా..?

సారాంశం

బ్రిస్బేన్ లోని గడ్బాలో టీమ్ ప్రాక్టీస్ సెషన్ లో  కోహ్లీ చాలా ఆనందంగా, నవ్వుతూ కనిపించారు. తన టీమ్ మెంబర్స్ కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్ లతో ఆయన చాలా సరదాగా గడిపారు.

టీ20 ప్రపంచకప్ టీమిండియా మొదటి వామప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడుతున్న నేపథ్యంలో.. కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా హుషారుగా కనిపించారు. ఆయన మునపటి కంటే రెట్టింపు ఉత్సాహం తో కనిపిస్తున్నారు. బ్రిస్బేన్ లోని గడ్బాలో టీమ్ ప్రాక్టీస్ సెషన్ లో  కోహ్లీ చాలా ఆనందంగా, నవ్వుతూ కనిపించారు. తన టీమ్ మెంబర్స్ కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్ లతో ఆయన చాలా సరదాగా గడిపారు.  దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత ఇటీవలే తన 71వ సెంచరీని సాధించిన కోహ్లి...ఈ ప్రాక్టీస్ సెషల్ లో డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

 

కాగా.. విరాట్ కోహ్లీ గత నెల రోజులుగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సెప్టెంబరులో ముగిసిన ఆసియా కప్ 2022లో అఫ్గానిస్థాన్‌పై సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ.. 1020 రోజుల శతక నిరీక్షణకి తెరదించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై కూడా నిలకడగా రాణించాడు.  ఈ టీ20 వరల్డ్ కప్ లోనూ కోహ్లీ అదరగొట్టాలని అభిమానులతో పాటు.. టీమిండియా ఎదురుచూస్తోంది. మళ్లీ ఫామ్ లోకి రావడంతో విరాట్ కోహ్లీ మునపటి కంటే ఉత్సాహంగా ఉంటున్నారు. ఆయన ఉత్సాహం ఆయన ముఖంలో స్పష్టంగా కనపడుతోంది.

ఇదిలా ఉండగా...భారత్, పాకిస్థాన్ మధ్య ఈ నెల 23 మెల్‌బోర్న్ వేదికగా మ్యాచ్ జరగనుంది. రెండు జట్లకీ టీ20 వరల్డ్‌కప్ 2022లో ఇదే ఫస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. కాగా... సోమవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది.  ఆ తర్వాత బుధవారం న్యూజిలాండ్‌తో కూడా వార్మప్ మ్యాచ్‌ని ఆడనుంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై వేగంగా అలవాటు పడేందుకు ఈ వార్మప్ మ్యాచ్‌లను భారత్ జట్టు వినియోగించుకోవాలని ఆశిస్తోంది. అయితే.. కోహ్లీకి ఆస్ట్రేలియాపై మంచి రికార్డ్ ఉంది. కానీ భారత్ జట్టులోని కొంత మంది ఆటగాళ్లకి ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం లేదు. అందుకే ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచులు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs BAN : తగ్గేదే లే.. బంగ్లాదేశ్ కు ఇచ్చిపడేసిన భారత్.. గ్రౌండ్‌లో హీట్ పుట్టించిన కెప్టెన్లు !
Vaibhav Suryavanshi : ఊచకోత అంటే ఇదే.. బంగ్లా బౌలర్లని ఉతికారేసిన వైభవ్ ! కోహ్లీ రికార్డు పాయే