కెఎల్ రాహుల్, సూర్యకుమార్ హాఫ్ సెంచరీలు... ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు...

By Chinthakindhi Ramu  |  First Published Oct 17, 2022, 11:09 AM IST

T20 World cup 2022: కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలు... 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసిన టీమిండియా...


ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. తొలి వికెట్‌కి కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి 78 పరుగుల భాగస్వామ్యం అందించారు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసి అస్టన్ అగర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

13 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ కాగా హార్ధిక్ పాండ్యా 5 బంతులాడి 2 పరుగులే చేసి నిరాశపరిచాడు. దినేశ్ కార్తీక్ 14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేయగా రవిచంద్రన్ అశ్విన్ 2 బంతుల్లో ఓ సిక్సర్‌తో 6 పరుగులు చేశాడు...

Innings Break!

Half-centuries from (57) & (50) propel to a total of 186/7 on the board.

Scorecard - https://t.co/3dEaIjz140 pic.twitter.com/vH0gy8xJnh

— BCCI (@BCCI)

Latest Videos

సూర్యకుమార్ యాదవ్ తన స్టైల్‌లో ఫామ్‌ని కొనసాగిస్తూ 33 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 6 బంతుల్లో 6 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కేన్ రిచర్డ్‌సన్‌  4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా గ్లెన్ మ్యాక్స్‌వెల్, అస్టన్ అగర్, మిచెల్ స్టార్క్‌ ఒక్కో వికెట్ తీశారు...

click me!