IPL Retention: తగ్గిన విరాట్ కోహ్లి, ధోని.. మయాంక్, సూర్యకుమార్ యాదవ్ కు గోల్డెన్ ఛాన్స్..

By team teluguFirst Published Nov 30, 2021, 10:14 PM IST
Highlights

IPL Retention Updates: ఐపీఎల్ రిటైన్డ్ ప్లేయర్లను విడుదల చేస్తున్న ఫ్రాంచైజీలు.. తగ్గిన  ధోని, కోహ్లి విలువ.. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)   వచ్చే సీజన్ కోసం త్వరలో నిర్వహించబోయే వేలానికి ముందు ఆయా జట్లు నిలుపుకోబోయే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) విడుదల చేయనుంది.  అంతలోపు  వివిధ కెప్టెన్ల కోచ్ లు, ఇతర సహాయక సిబ్బంది వాళ్లు దక్కించుకున్న ప్లేయర్ల జాబితాను విడుదల చేస్తున్నాయి. 

ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు నిలుపుకున్న ఆటగాళ్ల జాబితా : కేన్ విలియమ్సన్ (రూ. 14 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ. 4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 4 కోట్లు) .. (పర్స్ లో మిగిలిఉన్న నగదు రూ. 68 కోట్లు) 

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అట్టిపెట్టుకున్నది వీళ్లనే :  ఎంఎస్ ధోని (రూ. 12 కోట్లు), రవీంద్ర జడేజా (రూ. 16 కోట్లు), మోయిన్ అలీ (రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ. 6 కోట్లు) (మిగిలిఉన్న మొత్తం రూ. 48 కోట్లు)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఉండబోయేది వీళ్లే :  విరాట్ కోహ్ల (రూ. 15 కోట్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (రూ. 11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ. 11 కోట్లు) (మిగిలిఉన్న నగదు రూ. 57 కోట్లు) 

ముంబై ఇండియన్స్ (MI) దక్కించుకుంది ఈ నలుగురినే :  రోహిత్ శర్మ (16), జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు) (మిగిలిఉన్న నగదు రూ. 48 కోట్లు)

పంజాబ్ సూపర్ కింగ్స్ (PBKS) నిలుపుకున్నది వీళ్లనే :  మయాంక్ అగర్వాల్ ( రూ. 14 కోట్లు), అర్ష్దీప్ సింగ్ (రూ. 4 కోట్లు) (మిగిలిఉన్న నగదు రూ. 72 కోట్లు)

ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రిటైన్డ్ ప్లేయర్స్ :  రిషభ్ పంత్ (రూ. 16 కోట్లు) , అక్షర్ పటేల్ ( రూ. 9 కోట్లు), పృథ్వీ షా  (రూ. 7.5 కోట్లు), ఎన్రిచ్ నార్త్జ్ (రూ. 6.5 కోట్లు).. (మిగిలిఉన్న మొత్తం రూ. 47.5 కోట్లు)


రాజస్థాన్ రాయల్స్ (RR) రిటైన్ చేసుకున్నది వీళ్లే :  సంజూ శాంసన్ (రూ. కోట్లు), బట్లర్ (రూ. కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ. కోట్లు)..  (మిగిలి ఉన్న రూ. 62 కోట్లు)


కోల్కతా నైట్ రైడర్స్ (KKR) రిటైన్డ్ ప్లేయర్లు :  ఆండ్రూ రస్సెల్ (రూ. 16 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 8 కోట్లు),  వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు), సునీల్ నరైన్ (రూ.  6 కోట్లు).. (మిగిలిఉన్న మొత్తం రూ. 42 కోట్లు)   

click me!