83: అప్పుడు అండర్-19కు ఆడిన ఆ కుర్రాడే.. ఇప్పుడు రణ్వీర్ సింగ్ సినిమాలో కీ రోల్ కు ఎంపిక

By team teluguFirst Published Nov 30, 2021, 5:33 PM IST
Highlights

Ranveer Singh's 83: కపిల్ జట్టులో ఆల్ రౌండర్ మదన్ లాల్ ది కీ రోల్. 83 సినిమాలో ఈ పాత్రను పోషించింది హార్విందర్ సింగ్ సంధు. ఇతడు అంతకుముందు అండర్-19 క్రికెటర్. అంతేగాక....

భారతదేశ క్రికెట్ గతిని, గమనాన్ని మార్చిన 1983 వన్డే ప్రపంచకప్ కెప్టెన్  కపిల్ దేవ్ కెరీర్లోని పలు ఆసక్తికర అంశాల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘83’. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరో రణ్వీర్ సింగ్.. కపిల్ పాత్ర ను పోషిస్తుండగా అతడి భార్య (రొమి బాటియా)గా రణ్వీర్ నిజ జీవిత భార్య దీపికా పదుకునే నటించారు. కాగా ఈ సినిమాలో కీలక పాత్ర అయిన ఆల్ రౌండర్ మదన్ లాల్ పాత్రను ఓ మాజీ క్రికెటరే పోషిస్తుండటం గమనార్హం. ఎవరా క్రికెటర్..? నటుడెందుకయ్యాడు..? ఆ  విషయాలు మీకోసం.. 

కపిల్ జట్టులో ఆల్ రౌండర్ మదన్ లాల్ ది కీ రోల్. 83 సినిమాలో ఈ పాత్రను పోషించింది హార్విందర్ సింగ్ సంధు. ముద్దు పేరు హర్డీ సంధు.. పంజాబ్ కు చెందిన సంధు.. భారత్ తరఫున అండర్-19 క్రికెట్ ఆడాడు. ప్రస్తుత భారత జట్టులో విలువైన ఆటగాళ్లుగా గుర్తింపు తెచ్చుకున్న శిఖర్ ధావన్, ఛతేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ లతో కలిసి సంధూ క్రికెట్ ఆడాడు.  ఇక ధావన్ అయితే అతడి రూమ్ మేట్ కావడం గమనార్హం. 

2005కు ముందు అండర్-19 క్రికెట్ ఆడుతూ.. జాతీయ జట్టు లో చోటు కోసం చూస్తున్న హర్డీకి 2006లో భుజానికి గాయమైంది. అతడు రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. దీంతో కొద్దిరోజులు ఇక్కడే చికిత్స పొందిన సంధూ.. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ కొద్దిరోజులు  క్యాబ్ డ్రైవర్ గా పనిచేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఇండియాలో ఐపీఎల్ స్టార్ట్ అయింది. తనకంటే జూనియర్లు అయిన క్రికెటర్లు  ఐపీఎల్ లో మెరవడం.. భారత జట్టులోకి రావడం చూసి నిరాశకు గురైన హార్డీ.. తాను కూడా భారత్ కు తిరిగివచ్చాడు. ఒకవేళ తాను ఇక్కడ ఉంటే ఐపీఎల్ ఆడేవాడని గతంలో చెప్పాడు. 

 

Goosebumps Stuff🔥🔥🔥👍👍

Congratulations and teampic.twitter.com/rQHyDWTCtD

— Vamsi Kaka (@vamsikaka)

అయితే పట్టుదలతో ప్రాక్టీస్ చేసి తిరిగి క్రికెట్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన సంధూ.. పంజాబ్ తరఫున రంజీలు ఆడాడు. కానీ విధి అతడిని మళ్లీ వెక్కరించింది. 2009లో అతడు మళ్లీ గాయపడ్డాడు. అదే భుజం గాయం.. దీంతో క్రికెట్ తనకు అచ్చిరాదని ఫీల్డ్ మార్చాడు. క్రికెట్ ను విడిచిపెట్టిన అతడు.. మ్యూజిక్ మీద దృష్టి పెట్టాడు. పాప్ ఆల్బమ్స్, మాస్,  పంజాబ్ ఫోక్స్ తో మిక్స్ చేస్తూ మ్యూజిక్ మీద పట్టు సాధించాడు. 

తన గాత్రంతో వేలాది మంది అభిమానులను పొందిన హార్డీ.. 83లో వెండితెరలో కనిపించనున్నాడు. ఆల్ రౌండర్ మదన్ లాల్ పాత్రలో అతడు అదరగొట్టాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లలో సంధూ.. తన నటనతో ఆకట్టుకున్నాడు.  హిందీతో పాటు పలు భారతీయ  భాషల్లో డిసెంబర్ 24న ఈ చిత్రం విడుదల కానున్నది.

click me!