Ind Vs Nz: అందులో తప్పేమీ లేదు.. అలాక్కూడా ఫీల్డింగ్ చేయొచ్చు.. మయాంక్ కు అండగా నిలిచిన క్రికెట్ ఎక్స్పర్ట్

By team teluguFirst Published Nov 30, 2021, 9:34 PM IST
Highlights

India Vs New Zealand Test: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ తో  సోమవారం ముగిసిన తొలి టెస్టులో భారత ఆటగాడు మయాంక్ అగర్వాల్ ఫీల్డింగ్ పొజీషన్ పై వివాదం చెలరేగింది.  

ఇండియా-న్యూజిలాండ్ మధ్య కాన్పూర్ లో జరిగిన తొలి టెస్టు డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్.. మోకాళ్లపై ఫీల్డింగ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మ్యాచ్ జరుగుతుండగా.. అటాకింగ్ ఫీల్డింగ్ పెట్టిన కెప్టెన్ రహానే,  పీల్డర్లను బ్యాటర్లకు దగ్గరగా మొహరించాడు. ఇదే సమయంలో మయాంక్.. ఫస్ట్ స్లిప్ కు ముందు షాట్ స్వేర్ లెగ్ వద్ద  ఫీల్డింగ్ చేశాడు. 

ఈ క్రమంలో మయాంక్.. రెగ్యులర్ గా కాకుండా మోకాళ్ల మీద నిల్చుని ఫీల్డింగ్ చేశాడు. అయితే మయాంక్.. క్రికెట్ నిబంధనలను ఉల్లంఘించాడని పలువురు క్రికెట్ విశ్లేషకులు, ట్విట్టర్ లో  కివీస్ అభిమానులు  విమర్శలు గుప్పించారు. 

అయితే మయాంక్ కు మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ క్రికెట్ సలహాదారు జానీ సింగర్ మద్దతుగా నిలిచాడు. అలా ఫీల్డింగ్ చేయడం తప్పేమీ కాదని చెప్పాడు. క్రికెట్ లో మోకాళ్లపై ఫీల్డింగ్ చేయకూడదని ఎక్కడా లేదని, అందుకు సంబంధించి నిబంధనలు కూడా లేవని తెలిపాడు. ఆధునిక క్రికెట్ లో ఇలా చేయడం సర్వసాధారణమని అన్నాడు. 

 

Mayank Agarwal is on the knees and fielding.

Never seen that before 🤣🤣

because catches might keep low pic.twitter.com/E4g5vQBPgk

— Yogen (45) (@frontFootPuller)

జానీ సింగర్ మాట్లాడుతూ.. ‘ఫీల్డర్ మోకాళ్లపై ఫీల్డింగ్  చేయకూడదని క్రీడా చట్టాలలో  ఎక్కడా లేదు. ఇది ప్రస్తుత క్రికెట్ లో కామన్ అయిపోయింది. మోకాళ్లపై ఫీల్డింగ్ చేయడం తప్పేమీ కాదు..’ అని తెలిపాడు. 

అయితే మయాంక్ ను సమర్థించిన సింగర్.. బంతిని వేసే సమయంలో పీల్డర్ తన స్టాన్స్  మార్చుకుంటే మాత్రం అది కచ్చితంగా చట్టాన్ని ఉల్లంఘించినట్టే అని చెప్పాడు. ‘మోకాళ్లపై ఫీల్డింగ్ చేయడం తప్పు కాదు. కానీ బౌలర్ బంతి వేసిన తర్వాత ఫీల్డర్ తన పొజిషన్ మార్చుకుకని  మోకాళ్లపై ఫీల్డింగ్ చేస్తే మాత్రం అది ఐసీసీ 28.61 చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. అప్పుడు ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది..’ అని  అన్నాడు. 

click me!