ఉస్మాన్ ఖవాజా, ఆలెక్స్ క్యారీలకు తన జెర్సీని కానుకగా ఇచ్చిన విరాట్... కోహ్లీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ఖవాజా...

Published : Mar 14, 2023, 10:49 AM IST
ఉస్మాన్ ఖవాజా, ఆలెక్స్ క్యారీలకు తన జెర్సీని కానుకగా ఇచ్చిన విరాట్... కోహ్లీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ఖవాజా...

సారాంశం

అహ్మదాబాద్ టెస్టులో 180 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా... 186 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ... బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లుగా ఉస్మాన్ ఖవాజా, విరాట్ కోహ్లీ..

భారత మాజీ సారథి విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అతని ఫాలోయింగ్ వేరే లెవెల్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 టోర్నీ కోసం ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు ‘కింగ్ అడుగుపెట్టాడు’ అంటూ అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది..

ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్‌తో పాటు నాథన్ లియాన్ వంటి ప్లేయర్లు కూడా విరాట్ కోహ్లీకి అభిమానులు. తాజాగా ఈ లిస్టులో చేరిపోయారు ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ...

అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన టెస్టు జెర్సీలను కానుకగా తీసుకున్నారు ఉస్మాన్ ఖవాజా, అలెక్స్ క్యారీ. అహ్మదాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా.. విరాట్ కోహ్లీకి రిటర్న్ గిఫ్ట్‌గా తన జెర్సీని ఇవ్వడం విశేషం..

అహ్మదాబాద్ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 422 బంతుల్లో 21 ఫోర్లతో 180 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.. కామెరూన్ గ్రీన్ 170 బంతుల్లో 18 ఫోర్లతో 114 పరుగులు చేశాడు...

బదులుగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 571 పరుగులకి ఆలౌట్ అయ్యింది. యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ 235 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 128 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 364 బంతుల్లో 15 ఫోర్లతో 186 పరుగులు చేశాడు...

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో 4 మ్యాచుల్లో 7 ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా టాప్ స్కోరర్‌గా నిలవగా... 6 ఇన్నింగ్స్‌ల్లో 297 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అతని తర్వాతి స్థానంలో నిలిచాడు... ఆఖరి టెస్టులో 180 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజా, ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు...

అక్షర్ పటేల్ కొట్టిన ఓ సిక్సర్‌ని ఆపేందుకు ప్రయత్నించిన మార్నస్ లబుషేన్, కిందపడిపోవడంతో గాయపడి క్రీజు వదిలాడు. గాయం కారణంగా ఉస్మాన్ ఖవాజా ప్లేస్‌లో మ్యాట్ కుహ్నేమన్‌ని ఓపెనర్‌గా, నైట్‌ వాచ్‌మె‌న్‌గా పంపించింది ఆస్ట్రేలియా. 35 బంతులు ఫేస్ చేసిన కుహ్నేమన్, 6 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

అక్షర్ పటేల్ 5 ఇన్నింగ్స్‌ల్లో 264 పరుగులు చేసి మూడో స్థానంలో నిలవగా ఐసీసీ నెం.1 బ్యాటర్‌గా టోర్నీని ఆరంభించిన మార్నస్ లబుషేన్, అహ్మదాబాద్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఈ సిరీస్‌లో 4 మ్యాచుల్లో 8 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 244 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, తన ఐసీసీ నెం.1 బ్యాటర్ ప్లేస్‌ని మాత్రం నిలబెట్టుకోగలిగాడు...

గత మూడేేళ్లలో విరాట్ కోహ్లీ టెస్టు సగటు 30 కూడా దాటలేదు. ఈ సిరీస్‌లో కోహ్లీ సగటు 49.50 గా ఉంది. జూన్‌లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో మరోసారి తలబడబోతున్నాయి ఇండియా, ఆస్ట్రేలియా.. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?