గాయాలతో కళ తప్పనున్న ఐపీఎల్..! ముంబై, ఢిల్లీలకు భారీ ఎదురుదెబ్బ..

Published : Mar 13, 2023, 09:48 PM IST
గాయాలతో కళ తప్పనున్న ఐపీఎల్..! ముంబై, ఢిల్లీలకు భారీ ఎదురుదెబ్బ..

సారాంశం

IPL 2023: ఈనెల చివరి వారంలో మొదలుకాబోయే  ఇండియన్ ప్రీమియర్ లీగ్  ఈసారి కళ తప్పనుంది. కీలకమైన ఆటగాళ్లు గాయాల బారిన పడుతుండటంతో   ఫ్రాంచైజీలకు భారీ షాకులు తప్పడం లేదు. 

ఐపీఎల్ లో సీజన్ కు ఫ్రాంచైజీకి  ఒక్కరైనా మెరుగైన ప్రదర్శనలు చేసే ప్లేయర్  పుట్టుకొస్తాడు. ఒక్క సీజన్ లో వారి నుంచి దాదాపు ఐదారుగురు అయినా తర్వాతి సీజన్ వరకూ   సూపర్ స్టార్లుగా ఎదుగుతారు. అయితే  కొత్త కుర్రాళ్లు ఎంతమంది వచ్చినా  అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడే ఆటగాళ్లు ఉంటేనే ఐపీఎల్ కు కళ. కానీ ఈసారి జాబితాలో చాలా మంది  కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి మంచం పట్టారు. దీంతో ఐపీఎల్ కళ తప్పనుంది. 

జస్ప్రీత్  బుమ్రాను ఐపీఎల్ ను విడదీసి చూడలేం. ఈ లీగ్ ద్వారానే బుమ్రా.. టీమిండియాలో చోటు దక్కించుకుని  ఆ తర్వాత  ప్రపంచస్థాయిలో నెంబర్ వన్ బౌలర్ గా ఎదిగాడు.  కానీ  త్వరలో మొదలుకాబోయే సీజన్ లో బుమ్రా ఆడటం లేదు. బుమ్రా తో పాటు పలు   ఫ్రాంచైజీలకు  భారీ షాకులే తాకుతున్నాయి. 

బుమ్రాతో పాటు ముంబై ఇండియన్స్ ప్రధాన బౌలర్ జై రిచర్డ్‌సన్ కూడా సర్జరీ కారణంగా ఈ సీజన్ కు దూరమయ్యాడు.  ఇక ఢిల్లీ క్యాపిటల్స్ నుంచైతే జాబితా పెద్దదే. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్  గతేడాది  రోడ్డు ప్రమాదంలో గాయపడి  ఆరు నెలల పాటు   క్రికెట్ కు దూరంగా నిలిచాడు. డేవిడ్ వార్నర్ కూడా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో గాయంతో తిరిగి సిడ్నీకి వెళ్లాడు.  అన్రిచ్ నోర్త్జ్ కూడా  ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లు మిస్ కానున్నాడు. ఇలా ఐపీఎల్ సీజన్ కు ముందు గాయాల బారిన పడ్డ వివిధ ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్ల జాబితాను ఇక్కడ చూద్దాం. 

గాయపడ్డ ఆటగాళ్ల జాబితా : 

- జస్ప్రీత్ బుమ్రా (ముంబై- వెన్నునొప్పికి సర్జరీ కారణంగా ఇప్పటికే తప్పుకున్నాడు) 
- రిచర్డ్‌సన్ (ముంబై - ఇతడు కూడా  సర్జరతో  ఐపీఎల్ లో ఆడటం లేదు) 
- రిషభ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్ - రోడ్డు ప్రమాదంతో ఆరు నెలలు క్రికెట్ కు విరామం) 
- డేవిడ్ వార్రన్ (ఢిల్లీ - గాయం కారణంగా భారత పర్యటన నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. ఐపీఎల్ లో వచ్చే విషయమై స్పష్టత లేదు) 
- సర్ఫరాజ్ ఖాన్ (ఢిల్లీ - ఈ ముంబై కుర్రాడు  గాయం కారణంగా ఇరానీ కప్ ఆడలేదు) 
- అన్రిచ్ నోర్త్జ్ (ఢిల్లీ - గాయం వల్లే  కొన్నాళ్లు  జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్ లో ప్రారంభ మ్యాచ్ లు మిస్ కావొచ్చు) 
- ప్రసిధ్ కృష్ణ (రాజస్తాన్ రాయల్స్ - సర్జరీ కారణంగా ఈ సీజన్ లో ఆడటం లేదు) 
- జానీ బెయిర్ స్టో (పంజాబ్ కింగ్స్ - కాలి గాయం కారణంగా  చాలాకాలం క్రికెట్ కు దూరంగా ఉండాల్సి వస్తోంది) 
- జోష్ హెజిల్వుడ్ (ఆర్సీబీ - భారత పర్యటనకు వచ్చినా గాయం నుంచి  కోలోకోకపోవడంతో తిరిగి సిడ్నీకి వెళ్లిపోయాడు)

 

-  కైల్ జెమీసన్ (చెన్నై సూపర్ కింగ్స్ - ఈ న్యూజిలాండ్ పేసర్ కూడా శస్త్రచికిత్స నిమిత్తం ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు) 
- శ్రేయాస్ అయ్యర్ (కోల్కతా నైట్ రైడర్స్ - గాయం వల్లే ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. సర్జరీ అవసరమని వైద్యులు అంటున్నారు) 

పై జాబితా ప్రస్తుతమున్న  పరిస్థితుల మేరకే.. ఈ లీగ్ ప్రారంభానికి మరికొన్ని రోజులు సమయం ఉండటంతో ఆలోపు ఏ ఆటగాడు ఏ ఫ్రాంచైజీకి షాకులిస్తాడోనని  టీమ్ మేనేజ్మెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !