టాప్ లేపిన విరాట్ కోహ్లీ: ఈ దశాబ్దం సీఏ టెస్ట్ కెప్టెన్

By telugu teamFirst Published Dec 24, 2019, 10:37 AM IST
Highlights

క్రికెట్ ఆస్ట్రేలియా విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఈ దశాబ్దం టెస్టు కెప్టెన్ గా అతన్ని ఎంపిక చేసింది. అయితే, బ్యాటింగ్ లో మాత్రం ఐదో స్థానంలో అతను దిగాల్సి ఉంటుందని చెప్పింది.

సిడ్నీ: ఈ దశాబ్దం క్రికెట్ ఆస్ట్రేలియా (సిఏ) టెస్ట్ ఎలెవన్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు. గత పదేళ్ల కాలంలో ప్రపంచ క్రికెట్ లో అద్భుతంగా రాణించిన క్రికెటర్ల పేర్లు ఈ జాబితాలో చోటు చేసుకున్నాయి. క్రికెట్ లో తన బ్యాటింగ్ ప్రతిభ ద్వారా గౌరవప్రదమైన ఆటగాడిగా కోహ్లీ ఎదిగాడని సీఎ ప్రశంసించింది.

ఈ జట్టులో విరాట్ కోహ్లీ తన మూడో స్థానంలో కూడా దిగువన బ్యాటింగ్ కు దిగుతాడు.  న్యూజిలాండ్ కెప్టెన్ కానే విలియమ్సన్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడు. ఇంగ్లాండు మాజీ  కెప్టెన్ అలస్టిర్ కుక్ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తో కలిసి ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తాడు. 

మూడో స్థానంలో విలియమ్సన్ బ్యాటింగ్ కు దిగుతాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ కు వస్తాడు. ఐదో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తాడు. ఆరో స్తానంలో దక్షిణాఫ్రికా ఆటగాడు డీవిలియర్స్ బ్యాటింగ్ చేస్తాడు. అతనే జట్టు వికెట్ కీపర్ కూడా.

ఇంగ్లాండు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఏడో స్ధానంలో బ్యాటింగ్ కు వస్తాడు. దక్షిణాఫ్రికా లెజెండ్ డేల్ స్టెయిన్, ఇంగ్లాండుకు చెందిన స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ పేస్ బౌలర్లుగా ఉంటారు. ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ లియోన్ ఒక్కడే స్పిన్నర్ ఉంటాడు. 

click me!